డైలాగ్‌వార్‌తో వాళ్లు.. ర్యాప్ సాంగ్‌తో వీళ్లు.. భారత్ సమ్మిట్‌పై బీజేపీ, బీఆర్ఎస్ అభ్యంతరాల వెనుక కారణాలేంటి?

హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్ 2.0 అంతర్జాతీయ చర్చలకు వేదికగా మారడంతోపాటు తెలంగాణ రాజకీయాల్లోనూ వేడి పెంచుతోంది. రాహుల్ గాంధీ పర్యటన, తెలంగాణ రైజింగ్ థీమ్, గిగ్ వర్కర్ల సంక్షేమం, ఆటో కార్మికులకు ఇళ్ల నిర్మాణం వంటి అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ సదస్సుపై బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తుండగా, కాంగ్రెస్ మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది.

డైలాగ్‌వార్‌తో వాళ్లు.. ర్యాప్ సాంగ్‌తో వీళ్లు.. భారత్ సమ్మిట్‌పై బీజేపీ, బీఆర్ఎస్ అభ్యంతరాల వెనుక కారణాలేంటి?
Bharat Summit 2026 In Hyderabad

Updated on: Nov 13, 2026 | 9:45 PM

డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్.. సమ న్యాయాన్ని ప్రపంచీకరించడం. N-Y-A-Y… న్యాయ్ పేరుతో ఒక లాజికల్ సిద్ధాంతాన్ని కూడా ప్రపోజ్ చేసి, జ్యుడీషియరీలో కొత్త ఆలోచన రేకెత్తించారు రాహుల్‌గాంధీ. గత ఏడాది ఏప్రిల్‌లో ఆలిండియా కాంగ్రెస్ 140వ ఇనాగురల్ డే సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమ్మిట్‌కి రాహుల్ ఇచ్చిన ముగింపు ఇది. వెళుతూవెళుతూ రాజకీయాల గురించి రాహుల్‌గాంధీ ఏమైనా మాట్లాడారో లేదో గాని, దానిమీద పెద్ద రాద్ధాంతమైతే జరగలేదు. కానీ, ఈసారి భారత్ సమ్మిట్ మాత్రం మోత మోగిస్తోందా? రాజకీయాలు మాట్లాడక తప్పని పరిస్థితుల్లో పడిపోయారు రాహుల్‌గాంధీ. భారత్ సమిట్ 2.ఓ లక్ష్యాలు, లక్షణాలు ఏమైనా కావొచ్చు, ఇప్పటికైతే దానిచుట్టూ జరుగుతున్న రాజకీయాలే హాట్‌హాట్‌ అనిపిస్తున్నాయి. ”ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య సంస్థలు భీకరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.. మన డెమొక్రసీ ఐతే ప్రమాదపుటంచుల్లో ఉంది. ఎన్నికల వ్యవస్థలు, మీడియా స్వేచ్ఛ, సివిక్ సొసైటీ అన్నీ ప్రశ్నార్థకాలుగా మారిపోయాయ్. అట్టడుగు వర్గాలు, మహిళలు, మైనారిటీలు, గిరిజనుల హక్కులకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదు. మారాలి.. చాలా మారాలి..” ఇటువంటి క్రిటికల్ రివ్యూ జరిగితేనే సొసైటీలో ఏదైనా మార్పును ఆశించగలం. కొత్త సమాజం దిశగా అడుగూ వెయ్యగలం. అందుకే, మాట్లాడుకుందాం రా అని ప్రపంచానికి మరోసారి పిలుపునిచ్చింది తెలంగాణ నేల. రాజకీయ, ఆర్థిక,...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి