డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో బుక్కయిన నిర్మాత కుమారుడు!

| Edited By: Pardhasaradhi Peri

Jul 07, 2019 | 4:08 PM

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాల్లో నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ గస్తీలో సెలబ్రిటీల‌ వారసులు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఇలా దొరికిపోతే కొందరు సైలెంటుగా సమస్యను పరిష్కరించుకుంటే మరికొందరు మాత్రం వీరంగం వేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో శుక్రవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ సినీ నిర్మాత కుమారుడు పట్టుబడ్డాడు. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 10లోని డైమండ్ హౌస్ వద్ద ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో చిక్కిన అతడు అటుపై పోలీసులపై నానా రుబాబ్ చేయడం.. […]

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో బుక్కయిన నిర్మాత కుమారుడు!
Follow us on

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాల్లో నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ గస్తీలో సెలబ్రిటీల‌ వారసులు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఇలా దొరికిపోతే కొందరు సైలెంటుగా సమస్యను పరిష్కరించుకుంటే మరికొందరు మాత్రం వీరంగం వేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో శుక్రవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ సినీ నిర్మాత కుమారుడు పట్టుబడ్డాడు. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 10లోని డైమండ్ హౌస్ వద్ద ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో చిక్కిన అతడు అటుపై పోలీసులపై నానా రుబాబ్ చేయడం.. చివరికి శ్వాస విశ్లేషణ పరీక్షల్లో ఆల్కహాల్ సేవించాడని తేలడం తో అతడి కారుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఎవరా సెలబ్రిటీ సన్ అంటే.. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 25లో నివసించే ఓ సినీ నిర్మాత కుమారుడు అని తేలింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసారు పోలీసులు. ఓవైపు అతడు ఆల్కహాల్ సేవించాడని తేలినా పోలీసులతో వాగ్వాదానికి దిగడమే గాక.. ఓ రాజకీయ నాయకుడి చేత ఫోన్లు చేయించి నానా రచ్చ చేశాడట. అయితే ఈ బెదిరింపులకు లొంగని పోలీసులు తమ పని తాము చేసుకుపోయారు. పట్టుబడిన అతడికి.. మరో 12 వాహనదారులకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తామని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.