Hyderabad: పనికి వెళ్లి వస్తుండగా వెంటాడిన మృత్యువు.. ముగ్గురు కూలీల దుర్మరణం!

హైదరాబాద్ నగర శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై అప్పా జంక్షన్ సమీపంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకే ఆటోలో ఏకంగా 17 మంది ప్రయాణిస్తుండటం ఈ ప్రమాదంలో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Hyderabad: పనికి వెళ్లి వస్తుండగా వెంటాడిన మృత్యువు.. ముగ్గురు కూలీల దుర్మరణం!
Hyderabad Orr Accident

Updated on: Nov 08, 2026 | 9:58 AM

హైదరాబాద్: నగర శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై అప్పా జంక్షన్ సమీపంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకే ఆటోలో ఏకంగా 17 మంది ప్రయాణిస్తుండటం ఈ ప్రమాదంలో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ నుంచి మొయినాబాద్ వైపు వెళ్తున్న ఆటోలోని కార్మికులు ముచింతల్‌లో చెట్లు నాటే పని ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో అప్పా జంక్షన్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఎగ్జిట్ అవుతుండగా ముందుగా వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఆటో వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను పెంటయ్య, సురేష్, లింగరాజు శెట్టిగా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 17 మంది ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో అధిక సంఖ్యలో ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఒకే ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us