Telangana: బాబోయ్.. ఆ ఆస్పత్రిలో‌ ఎటు చూసినా విష సర్పాలే.. ఇంతకీ అవి ఎలా వచ్చాయంటే..

|

Jul 19, 2022 | 8:32 AM

Telangana: బాబోయ్ పాములు.. ఒకటి కాదు.. రెండు కాదు.. అడుగడుగునా పాములే. ఎటు చూసినా విష సర్పాలే. అందలోనూ ఆస్పత్రిలో ఈ విషసర్పాలు..

Telangana: బాబోయ్.. ఆ ఆస్పత్రిలో‌ ఎటు చూసినా విష సర్పాలే.. ఇంతకీ అవి ఎలా వచ్చాయంటే..
Snakes
Follow us on

Telangana: బాబోయ్ పాములు.. ఒకటి కాదు.. రెండు కాదు.. అడుగడుగునా పాములే. ఎటు చూసినా విష సర్పాలే. అందలోనూ ఆస్పత్రిలో ఈ విషసర్పాలు తిష్ట వేయడంతో అక్కడికి వచ్చే జనాలు, పెషెంట్స్ హడలిపోతున్నారు. ఇంతకీ ఈ పాములేంది? ఏ ఆస్పత్రి? అందులోకి పాములెలా వచ్చాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్‌) లో పాములు హడలెత్తిస్తున్నాయి. తాజా వరదల కారణంగా.. పాలుము కొట్టుకు వచ్చాయి. ఆ బురదలోనే తిష్ట వేసిన పాములు.. ఆస్పత్రి క్లీనింగ్ సిబ్బందిని కాటు వేశాయి. భారీ వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లాలో వరదలు పోటెత్తాయి. ఆ వరద నీరు ఎంసీహెచ్‌ను సైతం ముంచేశాయి. ఆస్పత్రిలోని ల్యాబరేటరీలు, అల్ట్రా సౌండ్‌ ఎక్స్‌రే యంత్రాలు, లేబర్‌ రూమ్ అన్నీ నీటిలో మునిగిపోయాయి. రూ.3 కోట్ల విలువ చేసే పరికరాలతోపాటు అత్యంత ఖరీదైన మందులు కూడా బురద పాలయ్యాయి. ఇదే సమయంలో వందలకొద్ది విష సర్పాలు వరదలకు కొట్టుకొచ్చాయి. అయితే, ఆస్పత్రిలో బురద క్లీన్ చేస్తుండగా.. ఈ పాములు బయటపడ్డాయి. పారిశుద్ధ్య పనులు చేస్తున్న సునీత అనే కార్మికురాలిని పాము కాటు వేసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, పాము కాటు ఘటనతో ఆస్పత్రిలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులు భయంభయంగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..