Heavy Rain Alert: వాతావరణ కేంద్రం హెచ్చరిక..! నేడు భారీ.. రేపు అతి భారీ వర్షాలు

రైతన్నలకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో వరుసగా 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో..

Heavy Rain Alert: వాతావరణ కేంద్రం హెచ్చరిక..! నేడు భారీ.. రేపు అతి భారీ వర్షాలు
Heavy Rains

Updated on: Jul 07, 2025 | 6:22 AM

హైదరాబాద్‌, జులై 7: వానల కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తున్న రైతులకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాగల ఐదు రోజులపాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మంగళవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

సోమవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని, మంగళవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని చెప్పింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ విభాగం పేర్కొంది. బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

మరోవైపు ఆదివారం (జులై 6) ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us