AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గుడ్‌న్యూస్‌.. తెలంగాణకు 3 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. ప్రభుత్వం కసరత్తు..!

Telangana Airports: వరంగల్‌తో పాటు ఉత్తర తెలంగాణ రవాణా ముఖచిత్రాన్ని మార్చేలా ఆదిలాబాద్ ఎయిర్‌ఫీల్డ్‌ను సివిల్, మిలిటరీ అవసరాల కోసం సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నట్లు ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో కొత్త..

Telangana: గుడ్‌న్యూస్‌.. తెలంగాణకు 3 కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. ప్రభుత్వం కసరత్తు..!
New Airports
Subhash Goud
|

Updated on: Jul 06, 2026 | 12:21 PM

Share

Telangana Airports: తెలంగాణ రాష్ట్రంలో ఏవియేష‌న్ రంగాన్ని విస్తరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు ముమ్మరం చేశాయి. రాష్ట్రంలో వ‌రంగ‌ల్ మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ ఇవ్వగా, వచ్చే నెలలో శంకుస్థాప‌న చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా ఆదిలాబాద్ విమానాశ్రయంకు సైతం అనుమ‌తి ల‌భించ‌డంతో డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. ఇక తాజాగా కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం స్థలాల ప‌రీశీల‌న పూర్తి చేసి దానికి సంబంధించిన‌ నివేదిక‌ను కేంద్రానికి పంపిచారు. అయితే ఇప్పటికే వ‌రంగ‌ల్ మూమునూరులో ఎయిర్‌పోర్ట్‌ను నిజాంమ‌ర్ ఉస్మాన్ అలీఖాన్ 1930లో నిర్మించారు.

స్వాతంత్య్రానికి పూర్వమే అతిపెద్ద ఎయిర్ పోర్ట్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు తిరిగి దానిని పునరుద్దరించనున్నారు. అయితే రానున్న రెండు సంవత్సరాలలో ఈ విమానాశ్రయాన్ని పూర్తి చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆదిలాబాద్‌లో నిర్మించనున్న విమానాశ్రయంను డిఫెన్స్‌, సివిల్‌ ఏవియేషన్‌ శాఖలు నిర్మాణం చేస్తున్నాయి. మొత్తం 1500 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించనున్నారు. ఈ విమానాశ్రయం ట్రైనింగ్‌ సెంటర్‌తో పాటు పౌర విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక కొత్తగూడెం విమానాశ్రయంను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మూడు విమానాశ్రయాలు పూర్తయినట్లయితే ఏవియేషన్‌లోనూ తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు దక్కనుంది.

ఇది కూడా చదవండి: Tata EV Discounts: టాటా ఈవీ కార్లపై బంపర్‌ ఆఫర్‌.. రూ.3.35 లక్షల వరకు డిస్కౌంట్‌..!

ఇదిలా ఉండగా, వరంగల్‌తో పాటు ఉత్తర తెలంగాణ రవాణా ముఖచిత్రాన్ని మార్చేలా ఆదిలాబాద్ ఎయిర్‌ఫీల్డ్‌ను సివిల్, మిలిటరీ అవసరాల కోసం సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నట్లు ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో కొత్త ఎయిర్‌ఫీల్డ్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ  వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి

Follow Us