Telangana Election: కాంగ్రెస్.. బీఆర్ఎస్.. యుద్ధం.. వచ్చినట్లు.. మధ్యలో కరెంట్ మెరుపులు

|

Oct 27, 2023 | 9:02 PM

గాంధీభవన్ తాన స్లోగన్స్‌ బుల్లెట్లా దూసుకొస్తున్నాయి కదూ...ఆరు హమీలే..ఆరు బ్రహ్మస్త్రాలంటూ ప్రచారం ముమ్మరంగా చేస్తోంది కదూ...మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ఓరేంజ్‌లో డైలాగులను డైనమైట్లలా పేలుస్తోంది కదూ...కానీ ఏది గెలుపుకు బ్రహ్మస్త్రమని హస్తం పార్టీ భ్రమపడుతోంది...ఏ హామీలు చూసుకుని ఎగెరిగిరి పడుతోందా.. ఏ రాష్ట్రంలో గెలుపును చూసుకుని బలుపుగా బలంగా భావిస్తుందో..అదంతా కాంగ్రెస్ కు భస్మాసుర హస్తం కాబోతోందని బీఆర్ఎస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది.

Telangana Election: కాంగ్రెస్.. బీఆర్ఎస్.. యుద్ధం.. వచ్చినట్లు.. మధ్యలో కరెంట్ మెరుపులు
Free Electricity Scheme
Follow us on

కాంగ్రెస్ తెలంగాణలో జెండా పాతబోతోంది… అంటూ గాంధీభవన్ తాన స్లోగన్స్‌ బుల్లెట్లా దూసుకొస్తున్నాయి కదూ…ఆరు హమీలే..ఆరు బ్రహ్మస్త్రాలంటూ ప్రచారం ముమ్మరంగా చేస్తోంది కదూ…మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ఓరేంజ్‌లో డైలాగులను డైనమైట్లలా పేలుస్తోంది కదూ…కానీ ఏది గెలుపుకు బ్రహ్మస్త్రమని హస్తం పార్టీ భ్రమపడుతోంది…ఏ హామీలు చూసుకుని ఎగెరిగిరి పడుతోందా.. ఏ రాష్ట్రంలో గెలుపును చూసుకుని బలుపుగా బలంగా భావిస్తుందో..అదంతా కాంగ్రెస్ కు భస్మాసుర హస్తం కాబోతోందని బీఆర్ఎస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది.

ఆరు గ్యారంటీలే తెలంగాణ చిమ్మచీకట్లలో పడేయడం గ్యారంటీ.. అంటూ ఆధారాలతో సహా ప్రజలముందు పెడుతోంది… ప్రజలకు అర్ధమయ్యేలా వివరణ ఇస్తోంది. ఎక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉందో… అక్కడ కాంగ్రెస్ ఎలాంటి హామీలిచ్చిందో… ఆ రాష్ట్రాల బతుకులను 70ఎంఎం స్క్రీన్‌మీద డీటీఎస్ సౌండ్‌ను మిక్స్ చేసి మరీ ప్రచారం చేస్తోంది.

కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు కేవలం అధికారం కోసమేనని..

అధికారం చేబట్టాక బుట్టదాఖలు చేయడం గ్యారంటీ అన్నది బీఆర్ఎస్‌ ప్రతి స్పీచ్‌లోనూ పెద్ద ఎత్తున విమర్శిస్తున్న పరిస్థితి. మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదా….అక్కడ పరిస్థితి ఏంటి..బీఆర్ఎస్ పదే పదే కాంగ్రెస్ పాలనలోని లోపాలను ఎత్తి చూపిస్తున్న కర్నాటకలో దుర్భరపరిస్థితులున్నాయా..అని ఓసారి ఆరా తీస్తే..పేరాలు పేరాలు కష్టాలే కనపడుతున్నాయంటున్నారు బీఆర్ఎస్ నేతలు…కర్నాటకలోని విపక్షపార్టీలు.

మీ జీవితాలకు అభయహస్తం ఐదు గ్యారంటీలంటూ కర్నాటకలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. కానీ హస్తం అధికారంలోకి వచ్చిన సందినుంచి అక్కడ కరెంట్ కష్టాలే నంటూ అక్కడ విపక్ష పార్టీలు రోజుకో చోట నిరసనలు చేబడుతున్నాయి. అంతెందుకు కర్నాటకలో పరిస్థితి ఇదీ అంటూ అక్కడి రైతులు మనరాష్ట్రంలో ధర్నాచేసిన పరిస్థితి మేలుకో తెలంగాణ మా కరెంట్ కష్టాలను తెలుసుకో అంటూ అక్కడి రైతాంగం మనరాష్ట్రంలో ఆందోళన చేసిన సిట్చువేషన్..

బీఆర్ఎస్ వెర్షన్‌లో…కర్నాటకలోని విపక్షాల మాటల్లో చూస్తే కర్నాటకలో ఐదు హామీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తోందట. ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి నిరంతర విద్యుత్తును ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ అమలులో మాత్రం మరీ తీసికట్టుగా ఉందన్నది అక్కడి రైతులు చెబుతున్న పరిస్థితి. సాగుకు కనీసం గంటసేపైనా విద్యుత్తు సరఫరా చేయట్లేదట. పలు జిల్లాల్లోని వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే దుస్థితివచ్చిందని రైతులు వాపోతున్నారు.

సాగుకు కనీసం 5 గంటల కరెంటునైనా ఇవ్వండంటూ ఆయా జిల్లాల్లోని రైతులు ఎలక్ట్రిక్‌ సబ్‌ స్టేషన్లు, విద్యుత్తు కార్యాలయాల ముందు నిరసనలు వ్యక్తం చేశారు. అయినా అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడంలేదట. ఇక పరిశ్రమలకు, గృహ అవసరాలకు కరెంట్‌ కటకటలాడాల్సి వస్తోందట. ఎప్పుడు వస్తుందో..ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి అని కర్నాటక వాసులు వాపోతున్నారట. పగటి పూట కనీసం ఆరుగంటల విద్యుత్ కోతపెడుతుంటే..రాత్రిళ్లు 8గంటల దాకా కోతవిధిస్తున్నారట.

దేశంలోని మొదటి ఐదు పారిశ్రామిక రాష్ట్రాలలో కర్ణాటక ఉంది. టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రెసిషన్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్స్, రెడీమేడ్ గార్మెంట్స్, బయోటెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి ప్రధాన పరిశ్రమలు రాష్ట్రంలో ఉన్నాయి. కానీ రుతుపవనాల వైఫల్యం కారణంగా విద్యుత్ ఉత్పత్తి పడిపోయింది. మరోవైపు పండుగరోజులు కావడంతో విద్యుత్‌ డిమాండ్ అసాధారణమైన స్థితికి వచ్చింది. ఈనెలలో అత్యధికంగా కర్నాటకలో 15వేల మెగావాట్ల డిమాండ్‌ ఏర్పడింది.

కానీ డిమాండ్‌కు తగ్గ సరఫరా కర్నాటకలో లేదు. దీనికి తోడు మేనెలలో విద్యుత్ సరఫరా కంపెనీలు టారిఫ్‌లను పెంచడంతో విద్యుత్ కోతలు అనివార్యమైంది. ఇది పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపింది. వర్షపాతం తగ్గడం, నీటిపారుదల పంపుసెట్లకు అధిక డిమాండ్, కోవిడ్ అనంతర ఆర్థిక పునరుద్ధరణ కారణంగా విద్యుత్ డిమాండ్ గత ఏడాది కంటే 40-50 శాతం ఎక్కువగా ఉందన్నది కర్నాటక సర్కార్ చెబుతున్నమాట.

కానీ ప్రతి నివాసానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించే కర్ణాటక ప్రభుత్వ గృహ జ్యోతి పథకం వల్ల విద్యుత్ వినియోగం పెరిగిందంటున్నారు అక్కడి వ్యాపారులు. అయితే రైతులకు కరెంటు కష్టాలు రాకుండా ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రణాళికలు లేవని ..ఇది సర్కార్ వైఫల్యమే అంటున్నారు పరిశ్రమలు. మామూలుగా కర్నాటకలో దేశంలో ఎక్కడాలేనివిధంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో టాప్‌లో ఉంది.

దాదాపు సోలార్ విద్యుత్ ఉత్పత్తి 9వేల మెగావాట్లు. అలాంటి రాష్ట్రం ఇప్పుడు ఎన్నడూలేనివిధంగా విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోయిందని..ఇదంతా అధికారం కోసం కాంగ్రెస్ సర్కార్ చేసిన అతిపెద్ద తప్పిదమని అంటున్నారు అక్కడి వ్యాపారు. ప్రస్తుతం రోజుకో చోట…పూటకో పరిశ్రమ ఆందోళనకు దిగే పరిస్థితి కనిపిస్తోందట. ఇప్పుడిదే అంశాన్ని మన తెలంగాణలో బ్రహ్మస్త్రంగా వినియోగించుకోబోతోంది బీఆర్ఎస్.

అక్కడ కర్నాటకలో ఐదు గ్యారెంటీలు.. అంతకన్నా ఒకటి ఎక్కువగా తెలంగాణలో ఆరు గ్యారెంటీలు. హామీలే అస్త్రాలుగా కాంగ్రెస్‌ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. తుక్కుగూడ సభలో స్వయంగా సోనియా గాంధీ, కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే రాహుల్‌, హామలను ప్రకటించారు. ములుగు సభతో ప్రియాంక కూడా ఫ్రేమ్‌లోకి వచ్చారు. ఎక్కడ సభ జరిగినా సరే ఆరు హామీలు పక్కాగా అమలు చేస్తామని గ్యారెంటీ ఇస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు.అంతేకాదు కర్నాటకలో గెలిచి నిలిచాం.. తెలంగాణలో పక్కాగా పవర్‌లోకి వస్తామని ఢంకా బజాయిస్తున్నారు.

కాంగ్రెస్‌ హామీలు ముచ్చట ఎలా వున్నా తెలంగాణ దంగల్‌ కీ ఫ్యాక్టర్‌గా మారింది. బెంగళూరు ఐటీ దాడుల్లో పట్టుబడిన సొమ్ము, సొత్తు కేంద్రంగా పొలిటికల్‌ విమర్శలు హోరెత్తాయి. తెలంగాణలో ఓటుకు నోటు కోసమే కర్నాటక నుంచి కోట్లు కోట్లు కుమ్మరిస్తున్నారని కాంగ్రెస్‌పై ఆరోపణలు సంధించారు బీఆర్‌ఎస్‌ నేతలు. అంతేకాదు హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చారే కానీ కర్నాటకలో కాంగ్రెస్‌ సర్కార్‌ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటిని అమలు చేయలేదని విమర్శించారు.

మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించే శక్తి పథకం అమలు జరుగుతున్నా దాంట్లో కూడా సవాలక్ష నిబంధనలు పెట్టిందట. అధికార, ప్రతిపక్షాలు ఫిరాయింపుల కుట్రల్లో తలమునకలుగా ఉండటంతో మూడున్నర నెలలు గడువకముందే రాష్ట్రంలో పాలన పడకేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా కర్ణాటకలో తాము అమలుచేస్తున్నది అద్భుత ఫార్ములా అని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకొంటోందంటోంది బీఆర్ఎస్. కర్నాటక ఫార్ములా అంటూ తెలంగాణలో డబ్బా కొడుతోందంటూ దెప్పిపొడుస్తోంది. ఒకవైపు విద్యుత్తు కోతలు, మరోవైపు పెరిగిన విద్యుత్తు చార్జీలతో పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చిందని…ప్రభుత్వం అధికారికంగానే పవర్‌ హాలిడేస్‌ కూడా ప్రకటించిందని…తెలంగాణలో ఇదే పరిస్థితి ఉండాల్నా అంటూ సీఎం కేసీఆర్ పదే పదే తన ప్రచార సభల్లో హైలెట్ చేస్తున్నారు..

కర్నాటకలో ఒకప్పుడు 40శాతం కమిషన్ ఉంటే..ఇప్పుడు కాంగ్రెస్ 50శాతం కమిషన్‌తో మరింత అవినీతి కూపంలో కూరుకుపోయిందంటున్నారు గులాబీ నేతలు. ప్రతి ప్రభుత్వ కాంట్రాక్టులో మంత్రులు, ఎమ్మెల్యేలకు 50 శాతం కమీషన్‌ ఇవ్వందే ఏ ఫైలూ కదలటం లేదని కర్నాటక సివిల్‌ కాంట్రాక్టర్ల సంఘం బాహాటంగానే విమర్శలు గుప్పిస్తోందట. ఏకంగా డిఫ్యూటీ సీఎం డీకే శివకుమార్‌పైనే ‘50’ పర్సెంట్‌ ఆరోపణలు వస్తుండడమే అక్కడి పాలనాతీరుకు నిదర్శనమంటున్నారు కాంగ్రెస్‌ ప్రత్యర్ధులు .

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి