Telugu News Telangana Congress Party releases 2nd list of candidates for Telangana Assembly Elections, Check full list
Telangana Elections: 45మంది అభ్యర్ధులతో తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. అజారుద్దీన్‌కి జూబ్లీహిల్స్.. గద్దర్ కూతురు వెన్నెలకు
Congress Party 2nd list: తెలంగాణలో జరగనున్న ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 45 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. బీజేపీలో ఉండి తిరిగి పార్టీలో చేరిన కె.రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నుంచి చోటు కల్పించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సెగ్మెంట్ నుంచి గద్దర్ కూతురు వెన్నెలకు టికెట్ ఇచ్చింది. 55 మందితో తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 100కు చేరింది. ఇంకా మరో 19 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది..
Telangana Congress
Follow us on
తెలంగాణలో జరగనున్న ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 45 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. 55 మందితో తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 100కు చేరింది. ఇంకా మరో 19 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో గద్దర్ కుమార్తె జీవీ వెన్నెలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు ఇచ్చింది. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి కి రెండో జాబితాలో అవకాశం ఇచ్చింది. బీజేపీలో ఉండి తిరిగి పార్టీలో చేరిన కె.రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నుంచి చోటు కల్పించింది.
రెండో జాబితాలోని అభ్యర్థుల వివరాలను ఇక్కడ చూడండి
సిర్పూర్ – రావి శ్రీనివాస్
అసిఫాబాద్ (ఎస్టీ) – అజ్మీరా శ్యామ్
ఖానాపూర్ (ఎస్టీ) – వెద్మర బొజ్జు
ఆదిలాబాద్- కంది శ్రీనివాస్ రెడ్డి
బోథ్ (ఎస్టీ) – వెన్నెల అశోక్
ముథోల్ – బోస్లె నారాయణరావు పాటిల్
ఎల్లారెడ్డి – కె.మదన్ మోహన్ రావు
నిజామాబాద్ రూరల్ – డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి