Amit Shah: దళిత సీఎంను ఇప్పటికైనా చేసే సత్తా ఉందా.. సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా అమిత్‌షా బహిరంగ సవాల్‌

| Edited By: Sanjay Kasula

Oct 27, 2023 | 7:52 PM

Telangana Elections: తెలంగాణలో అసలైన సవాళ్ల యుద్ధం మొదలైంది.. సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా బీజేపీ అగ్రనేత అమిత్‌షా రంగంలో దిగారు. దళిత సీఎంను ఇప్పటికైనా చేసే దమ్ముందా అంటూ బీఆర్ఎస్‌కు బహిరంగ సవాల్‌ విసిరారు. అంతేకాదు తమకు అధికారం అప్పగిస్తే బీసీని సీఎం చేస్తామని ప్రకటించారు అమిత్‌షా. బీజేపీ బీసీ నినాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించనుంది. అటు దళిత సంక్షేమం కూడా ప్రధానఅస్త్రంగా మారింది.

Amit Shah: దళిత సీఎంను ఇప్పటికైనా చేసే సత్తా ఉందా.. సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా అమిత్‌షా బహిరంగ సవాల్‌
Amit Shah
Follow us on

తొలి అభ్యర్ధుల జాబితా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో పర్యటించిన అమిత్‌షా సరికొత్త సంచలనానికి తెరతీశారు. సూర్యాపేట బహిరంగసభ వేదికగా అధికారం అప్పగిస్తే బీసీని సీఎంను చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ బీసీ వ్యతిరేక పార్టీ అంటున్న అమిత్‌ షా… జాతీయస్థాయిలో రాజ్యగంబద్దంగా బీసీ కమిషన్ వేసిన ఘనత బీజేపీదేనన్నారు. ఏడాదికి 10వేల కోట్ల నిధులు ఇస్తామని కేసీఆర్‌ వెనకబడిన వర్గాలను మోసం చేశారన్నారు.

తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కుటుంబ పార్టీలని ఆయన విమర్శించారు. బీజేపీ లక్ష్యం పేదల అభివృద్ధి అయితే కాంగ్రెస్ , బీఆర్ఎస్‌ల లక్ష్యం వారి పరివారాన్ని అభివృద్ధి చేయడమేని విమర్శించారు. పేదల, దళితుల వ్యతిరేక పార్టీ అని, కాంగ్రెస్ బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే ఎంఐఎం కు ఓటేసినట్లేనని ఆయన అన్నారు. సూర్యాపేట ప్రజా గర్జన సభ వేదికగా బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై అమిత్ షా విమర్శల వర్షం గుప్పించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేటలో ప్రజా గర్జన పేరుతో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు కేంద్ర మంత్రులు అమిత్ షా తో పాటు కిషన్ రెడ్డి హాజరయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసే కాంగ్రెస్, బీఆర్ఎస్  పార్టీలు వారి వారసులను ముఖ్య మంత్రులను చేయడానికే తపిస్తున్నాయని ఆయన విమర్శించారు. బీజేపీ లక్ష్యం పేదల అభివృద్ధి అయితే కాంగ్రెస్ , బీఆర్ఎస్‌ పార్టీల లక్ష్యం మాత్రం వారి పరివారాన్ని అభివృద్ధి చేయడమేనని అన్నారు.

తెలంగాణ ప్రజల కృష్ణా జలాల హక్కులను కాపాడేందుకు వాటర్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశామని అమిత్ షా గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు తుంగలోతొక్కిందన్నారు. ఓ వైపు అత్యధికంగా ఓట్లున్న బీసీ ఓట్లు టార్గెట్‌ చేస్తూనే.. దళిత అంశాలను ప్రస్తావించారు. దళితులను సీఎం చేస్తానన్న బీఆర్ఎస్‌.. ఇప్పుడు ప్రకటన చేసే దమ్ముందా అంటూ సవాల్‌ విసిరింది బీజేపీ. దళిత సీఎం మాట తప్పిన కేసీఆర్‌ వారికి ఇస్తానన్న మూడెకరాల భూముల విషయంలోనూ మోసం చేశారన్నారు అమిత్‌షా. బీఆర్ఎస్‌, కాంగ్రెస్ రెండూ కుటుంబపార్టీలేనని.. రాహుల్‌ను ప్రధాని చేయాలని సోనియాగాంధీ ఆరాటపడుతుంటే.. కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్‌ చూస్తున్నారని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేలు గెలిచినా మళ్లీ బీఆర్ఎస్‌కు అమ్ముడుపోతారంటోంది బీజేపీ.

సీఎం కేసీఆర్..బీసిల సంక్షేమాన్ని విస్మరించారని, ప్రధాని మోదీ వచ్చాక బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం రూ. 25లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. పేద ప్రజల ఆకలి తీర్చడానికి
కోసం నెలకు 5 కేజీల ఉచిత బియ్యం ఇస్తున్నామని అన్నారు అమిత్ షా.

పసుపు రైతుల కోసం ఎవరు చేయని విధంగా పసుపు బోర్డు ఏర్పాటు చేసామని, గిరిజన యూనివ్సిటీ ఏర్పాటు చేశామని అన్నారు. అయోధ్యలో అద్భుతమైన రామ మందిరాన్ని నిర్మించామన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి