Electric Bike Explosion: పేలిన ఎల‌క్ట్రిక్ వాహ‌నం.. బైక్‌తోపాటు ఇల్లు కూడా..

| Edited By: Rajeev Rayala

Jun 08, 2022 | 10:13 AM

చార్జింగ్‌ పెట్టిన బైక్‌ పేలడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అర్ధరాత్రి టైమ్‌లో ఒక్కసారిగా శబ్ధం రావడంతో ఇంట్లో నుంచి కుటుంబసభ్యులు పరుగులు తీశారు.

Electric Bike Explosion: పేలిన ఎల‌క్ట్రిక్ వాహ‌నం.. బైక్‌తోపాటు ఇల్లు కూడా..
Electric Bike Explosion
Follow us on

Electric Bike Explosion: ఎలక్ట్రిక్‌ బైక్‌ మళ్లీ పేలింది. బైక్‌తోపాటు ఇల్లు కూడా మొత్తం కాలిపోయింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. చార్జింగ్‌ పెట్టిన బైక్‌ పేలడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ప్రాణభయంతో ఇంట్లో వారు పరుగులు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దచీకోడ్‌లో అర్థరాత్రి ఎలక్ట్రిక్‌ బైక్‌ పేలింది. పుట్టలక్ష్మీనారాయణ ఎప్పటిలాగానే రాత్రి ఇంటి ముందు బైక్‌ చార్జింగ్‌ పెట్టారు. అర్ధరాత్రి టైమ్‌లో ఒక్కసారిగా శబ్ధం రావడంతో ఇంట్లో నుంచి కుటుంబసభ్యులు పరుగులు తీశారు. పెట్రోల్ ధ‌ర‌లు రోజురోజుకు పెరుగుతుండడంతో, ఆ భార మోయలేక ఎల‌క్ట్రిక్ బైక్ కొంటే.. ఏకంగా ఉన్న ఇంటినే కోల్పోయామని బాధితులు పేర్కొంటున్నారు.

ఇక ఇలాంటి ఘటనలే చాలాచోట్ల చోటుచేసుకుంటున్నాయి. ఎలక్ట్రిక్‌ బైకులు డేంజర్‌గా మారాయి. రాత్రిపూట చార్జింగ్‌ పెట్టి మరిచిపోతే చాలు పేలిపతున్నాయి. బ్యాటరీ సమస్యా? లేక ఓవర్‌ చార్జింగ్‌ ప్రొబ్లమా? తెలియడం లేదు. కానీ, ఎలక్ట్రిక్‌ బైకులు మాత్రం వణుకు పుట్టిస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లాలోని రామడుగు మండలంలో 2022 మే 10న ఇలాంటిదే జరిగింది. రామచంద్రాపూర్‌ గ్రామానికి చెందిన ఎగుర్ల ఓదేలు తన ఎలక్ట్రిక్‌ వెహికిల్‌కు రాత్రిపూట ఛార్జింగ్‌ పెట్టి పడుకున్నాడు. కాగా, అర్ధరాత్రి సమయంలో బ్యాటరీ పేలడంతో ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కుంటుబ సభ్యులు మంటలను త్వరగానే ఆర్పేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇక్కడ చదవండి