Edupayala Temple In Medak: పూల మొక్కలు,చెట్ల ఆకులతో అమ్మవారికి అలంకరణ.. వనదుర్గమాత అలంకరణలో ఏడుపాయల అమ్మవారు..

| Edited By: Ravi Kiran

Jul 16, 2023 | 12:07 PM

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లిలో గ్రామంలో మంజీర నది తీరాన ఏడుపాయలగా వెళ్తున్న నీటి ఒడ్డున వెలిసి,వందల ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం ఇది.. ప్రస్తుతం ఆషాడ మాసం సందర్భంగా అమ్మవారిని రోజుకు ఒక్కరూపంలో అలకరిస్తున్నారు..ప్రతి రోజు ఒక రూపంలో భక్తులకు దర్శమిస్తున్నారు అమ్మవారు..

Edupayala Temple In Medak: పూల మొక్కలు,చెట్ల ఆకులతో అమ్మవారికి అలంకరణ.. వనదుర్గమాత అలంకరణలో ఏడుపాయల అమ్మవారు..
Vanadurga
Follow us on

పచ్చని ప్రకృతి తీరంలో మంజీరా నది ఏడుపాయలుగా ప్రవహిస్తున్న స్థలంలో, కోరిన భక్తులకు కొంగు బంగారంగా కల్పతరువుగా వెలసిన అమ్మవారు ఆషాడ మాసం సందర్భంగా వన దుర్గమాతగా దర్శనమిచ్చారు..ఈ రూపంలో అమ్మవారిని చూసిన భక్తులు ఉబ్బితబ్బిపోతున్నారు..మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లిలో గ్రామంలో మంజీర నది తీరాన ఏడుపాయలగా వెళ్తున్న నీటి ఒడ్డున వెలిసి,వందల ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం ఇది.. ప్రస్తుతం ఆషాడ మాసం సందర్భంగా అమ్మవారిని రోజుకు ఒక్కరూపంలో అలకరిస్తున్నారు..ప్రతి రోజు ఒక రూపంలో భక్తులకు దర్శమిస్తున్నారు అమ్మవారు..

ఈరోజు వనదుర్గ దేవిగా అలంకరించారు..ఆ ప్రాంతంలో దొరికే చెట్ల ఆకులతో,పూల మొక్కలతో, అమ్మవారిని అలంకరించారు..ఈరోజు ఆదివారం కావడం వల్ల ఈ వనదుర్గ దేవిని దర్శనం చేసుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా కర్ణాటక,మహారాష్ట్రల నుండి కూడా తండోపతండాలుగా భక్తులు వస్తుంటారు..వీరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఆలయ సిబ్బంది అన్ని రకాల వసతులను ఏర్పాటు చేశారు..

ఇవి కూడా చదవండి