Kamareddy Municipality: కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం..!

కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవిపై అవిశ్వాసానికి సంబంధించిన రాజకీయం చివరి దశకి చేరుకుంది. నేడు అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం ప్రత్యేక బస్సుల్లో కౌన్సిలర్లను సమావేశానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు.

Kamareddy Municipality: కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం..!
Kamareddy Municipal Chairperson
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Mar 30, 2024 | 10:18 AM

కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవిపై అవిశ్వాసానికి సంబంధించిన రాజకీయం చివరి దశకి చేరుకుంది. నేడు అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం ప్రత్యేక బస్సుల్లో కౌన్సిలర్లను సమావేశానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. 49 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో అవిశ్వాసం నెగ్గడానికి 34 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. అయితే కాంగ్రెస్ శిబిరంలో 27 మంది కౌన్సిలర్లు ఉండగా, బీఆర్ఎస్ కి చెందిన మరో 9 మంది కౌన్సిలర్లు మద్దతు తెలుపుతున్నారు. దీంతో అవిశ్వాసాన్ని నెగ్గేందుకు సరిపడా బలం లభించింది.

అవిశ్వాసం వీగిపోవడానికి చైర్ పర్సన్ జాహ్నవి తరపున ఆమె తండ్రి వేణుగోపాల్ రావు అన్ని ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ జిల్లా నాయకులతో మాట్లాడి అవిశ్వాసం నెగ్గేలా చూడాలని ఆదేశించారు. అయినప్పటికీ ఆ పార్టీ నేతల నుంచి సరైన స్పందన రాలేదట. ఇదే సమయంలో కోర్టులో స్టే కోసం ప్రయత్నించారు. దీంతో అవిశ్వాసం నెగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాగా అధికారులు మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మాన సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. మరికొన్ని గంటల్లో సమావేశం జరిగి ఓటింగ్ నిర్వహించనున్నారు.

మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న నిట్టు జాహ్నవిపై ప్రతిపాదించిన అవిశ్వాసం నెగ్గితే ఆమె పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది. వెంటనే ఇంచార్జి చైర్ పర్సన్ గా వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియకు బాధ్యతలు అప్పగిస్తారు. తర్వాత చైర్పర్సన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇస్తారు. చైర్ పర్సన్ పదవిని ఇందుప్రియతో పాటు మరో కౌన్సిలర్ వనిత కూడా ఆశిస్తున్నారు. అయితే ఇప్పటికే చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎవరు అన్నదానిపై కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అవిశ్వాసం నెగ్గి జాహ్నవి మాజీ అవుతుందా? ఇందుప్రియ ఇంచార్జి చైర్పర్సన్ అవుతుందా? అన్నది మరికొద్దిసేపట్లో తేలనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…