Telangana High Court: హుజురాబాద్‌లో దళితబంధు అమలుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్..

|

Oct 21, 2021 | 7:27 PM

హుజురాబాద్‌లో దళితబంధు పధకాన్ని అమలు చేయాలంటూ సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Telangana High Court: హుజురాబాద్‌లో దళితబంధు అమలుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్..
High Court
Follow us on

హుజురాబాద్‌లో దళితబంధు పధకాన్ని అమలు చేయాలంటూ సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దళిత బంధు ఆపాలని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ పిటిషనర్ మల్లేపల్లి లక్ష్మయ్య పిల్‌లో కోరారు. దళితులకు ఉపయోగపడే దళితబంధు పధకాన్ని ఆపడం కరెక్ట్ కాదని.. పేదలకు ఎంతగానో ఉపయోగపడే ఈ పధకాన్ని వెంటనే అమలు చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు. వెస్ట్రన్ ఇంట్రెస్ట్‌తోనే కొంతమంది ఈ పధకాన్ని ఆపారని.. ఎన్నికలతో సంబంధం లేకుండా దళితబంధును అమలు చేయాలని మల్లేపల్లి లక్ష్మయ్య న్యాయస్థానానికి వివరించారు. కేంద్ర ఎన్నికల కమీషన్, రాష్ట్ర ఎన్నికల కమీషన్, తెలంగాణ ప్రభుత్వంను ప్రతివాదులుగా చేర్చిన పిటిషనర్.. యధావిధిగా దళిత బంధు పధకాన్ని అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు.

Also Read:

ఆ ఇంటివారికి పెరట్లోకి వెళ్లాలంటే భయం.. తలకు హెల్మెట్‌ పెట్టాల్సిందే.. కారణం తెలిస్తే నవ్వాపుకోలేరు..

కంటైనర్‌ను ఓపెన్ చేసి చూడగా షాక్.. భయంతో ఒక్కసారిగా కళ్లు తేలేసారు.!

పెరుగు బెస్టా.. మజ్జిగ బెటరా.! ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

పెళ్లికాని అబ్బాయిలకు షాక్.. అక్కడి అమ్మాయిలు అలా డిసైడయ్యారట! విస్తుపోయే విషయాలు..