AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagga Reddy: మరోసారి హాట్‌టాపిక్‌గా మారిన జగ్గారెడ్డి వ్యవహారం.. సీఎం కేసీఆర్‌ ఉద్యోగ ప్రకటనపై ఏమన్నారంటే..

గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌ పార్టీలో కాక రేపుతున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) . పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా బహిరంగంగా విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు

Jagga Reddy: మరోసారి హాట్‌టాపిక్‌గా మారిన జగ్గారెడ్డి వ్యవహారం.. సీఎం కేసీఆర్‌ ఉద్యోగ ప్రకటనపై ఏమన్నారంటే..
Basha Shek
|

Updated on: Mar 09, 2022 | 1:27 PM

Share

గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌ పార్టీలో కాక రేపుతున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) . పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా బహిరంగంగా విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. పార్టీకి రాజీనామా చేస్తానంటూ హడావిడి కూడా చేసి ఆతర్వాత వెనక్కుతగ్గారు. ఇక తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలకు ముందు రోజు ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష భేటీని బహిష్కరించారు. ఇక  జగ్గారెడ్డి త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరుతారన్న వార్తలు వినిపిస్తోన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ను ప్రశంసిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్‌ టాపిక్‌గా మారాయి. కాగా అసెంబ్లీలో కేసీఆర్‌ చేసిన ఉద్యోగ ప్రకటననను స్వాగతిస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు.

రేపు సీఎంను కలిసేందుకు .. ‘ఒక ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్‌ ప్రకటనను స్వాగతిస్తున్నాను. నిరుద్యోగుల కోసం ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు గాను కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ కోసం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గత ఏడేళ్లుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. నిరుద్యోగుల తరఫున యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూ ఐ ఆధ్వర్యంలో వివిధ పోరాటాలు నిర్వహించాం. తెలంగాణలో ఈరోజు ఈ ఫలాలు వస్తున్నాయంటే అది సోనియా, రాహుల్ గాంధీల కృషే. హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌ ను పునఃప్రారంభించేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. దీనికి సంబంధించి రేపు సీఎంను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ అడుగుతాను’ అని జగ్గారెడ్డి తెలిపారు.

Also Read:Russia Ukraine Crisis: ఎల్లలు దాటిన భారత దేశ సేవలు.. ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపిన పాకిస్తాన్ మహిళ

మరిదిపై మనసు పడ్డ వదిన.. తాళి కట్టిన భర్తను వదిలేసి.. అదే కారణమా

MCC Cricket Rules: క్రికెట్‌ నిబంధనలలో మార్పులు.. ఇప్పుడు బాల్‌పై ఉమ్మివేయలేరు..!