తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.
అమెరికాలో అధికారిక పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వరస భేటీలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రప్రభుత్వం మొత్తం 8 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒప్పందాలు చేసుకున్న కంపెనీల్లో కాగ్నిజెంట్, వాల్ఫ్, ఆర్సీసీఎం, స్వచ్ఛ్ బయో, ట్రైజిన్, HCA హెల్త్, కార్నింగ్, వివింట్, స్క్వాబ్ ఉన్నాయి. డల్లాస్‌లో సీఎం బృందంతో జరిపిన చర్చలలో హైదరాబాద్‌లో టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు చార్లెస్ స్క్వాబ్ కంపెనీ ముందుకొచ్చింది. ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ప్రపంచంలో చార్లెస్ స్క్వాబ్ పేరొందిన సంస్థ. హైదరాబాద్‌లో టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఈ కంపెనీ ఆసక్తి చూపుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ ఇదే కావటం విశేషం.
హైదరాబాద్‌లో ఈ కంపెనీ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామన్నారు. త్వరలోనే ఈ కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ వస్తారని సీఎం ప్రకటించారు. పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఖండించారు. కంపెనీలతో అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతే సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
After successfully completing the New York, New Jersey, Washington DC, Dallas and Texas legs of the US Tour, Chief Minister Sri @revanth_anumula and his team are going to shortly begin their California pitch.
Following interactions with several top CEOs in the West Coast, the… pic.twitter.com/aqHpk9NAwg
— Telangana CMO (@TelanganaCMO) August 8, 2024
డాలస్‌లో పెట్టుబడుల సమావేశాలు ముగించుఉన్న తెలంగాణ సీఎం బృందం శాన్‌ఫ్రాన్సిస్కోకు చేరుకుంది. ఇక్కడ ఆపిల్ సంస్థ హెడ్ క్వార్టర్స్‌ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. అనంతరం పలు కంపెనీల సీఈవోలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం సమావేశమై పెట్టుబడులపై చర్చించనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..