RunaMafi Politics: హరీష్‌రావు దమ్ముంటే రాజీనామా చేయాలన్న సీఎం రేవంత్‌.. బీఆర్ఎస్ కౌంటర్‌ ఎటాక్‌

తెలంగాణలో రుణమాఫీ... రణమాఫీగా మారింది. పాలక, ప్రతిపక్షాలు.. దేనికదే తగ్గేదేలే అంటున్నాయ్. బీఆర్ఎస్‌ నేతల సవాళ్లను తెరపైకి తెస్తూ... రచ్చ రచ్చ చేశారు అధికార కాంగ్రెస్‌ నేతలు. ఇటు మేమేం తక్కువ కాదన్నట్లూ విరుచుకుపడ్డారు గులాబీ లీడర్లు.

RunaMafi Politics: హరీష్‌రావు దమ్ముంటే రాజీనామా చేయాలన్న సీఎం రేవంత్‌.. బీఆర్ఎస్ కౌంటర్‌ ఎటాక్‌
CM Revanth Reddy, Harish Rao
Follow us

|

Updated on: Aug 16, 2024 | 7:42 AM

తెలంగాణలో రుణమాఫీ… రణమాఫీగా మారింది. పాలక, ప్రతిపక్షాలు.. దేనికదే తగ్గేదేలే అంటున్నాయ్. బీఆర్ఎస్‌ నేతల సవాళ్లను తెరపైకి తెస్తూ… రచ్చ రచ్చ చేశారు అధికార కాంగ్రెస్‌ నేతలు. ఇటు మేమేం తక్కువ కాదన్నట్లూ విరుచుకుపడ్డారు గులాబీ లీడర్లు. దీంతో ఇరువర్గాల మధ్య నువ్వా-నేనా అన్నట్లు… ఏకే47 రేంజ్‌లో మాటల తూటాలు పేలాయి.

మూడో విడతలో భాగంగా.. 2 లక్షల రూపాయల వరకు ఉన్న 14 లక్షల 45 వేల మందికి పైగా రైతులకు రుణాలను మాఫీ చేస్తున్నామని ప్రకటించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇందుకోసం 18వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్ట్‌15 లోపే రుణాలను మాఫీ చేసి చూపించామని తెలిపారు. అంతేకాదు మాట ఇచ్చాం.. చేసి చూపించాం అంటూ పంచ్‌ వేశారు. బీఆర్ఎస్‌ నేతలనే టార్గెట్‌గా పవర్‌ ఫుల్‌ డైలాగులు వదిలారు.

వాయిస్ః ఇచ్చిన టైమ్‌ ప్రకారం రుణమాఫీ చేశామన్న సీఎం రేవంత్‌రెడ్డి.. మాజీ మంత్రి హరీశ్ రావుపై నిప్పులుకక్కారు. ఆగస్ట్‌ 15లోపు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన హరీశ్ రావు.. ఇచ్చిన మాట ప్రకారం క్షమాపణ చెప్పి మరీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దమ్ముండే రాజీనామా చేసి… ఎన్నికలకు దూరంగా ఉండాలని కాస్త ఘాటుగానే మాట్లాడారు సీఎం రేవంత్‌రెడ్డి.

ఇక సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదిగా ద్వజమెత్తారు బీఆర్ఎస్ నేత హరీష్‌రావు. సిద్ధిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలంటూ.. రేవంత్‌ అన్న మాటలపై మండిపడ్డారు. అసలు పూర్తిస్థాయిలో రుణమాఫీనే జరగలేదన్నారు. అబద్దం కూడా సిగ్గుపడి మూసీలో దూకి ఆత్మహత్య చేసుకునేలా రేవంత్‌ మాటలున్నాయన్నారు హరీష్‌రావు. దేవుళ్ల మీద ఒట్టుపెట్టి కూడా మాట మీద నిలబడక పోగా…బిఆర్ఎస్ మీద, తనమీద అవాకులు చెవాకులు పేల్చడం ఏంటని ఫైర్‌ అయ్యారు. రైతులను మోసం చేసినట్లు క్లియర్‌గా కనబడుతున్నప్పుడు… రాజీనామా ఎందుకు చేయాలి…? ఎవరు చేయాలి..? అంటూ ఎక్స్‌ వేదికగా కౌంటర్‌ ఎటాక్‌కి దిగారు. అంతేకాదు రేవంత్‌ రైతు ద్రోహి మాత్రమే కాదు.. దేవుళ్ల మీద ఒట్లు వేసి అబద్దం ఆడారు కాబట్టి దైవ ద్రోహి కూడా అంటూ ధ్వజమెత్తారు.

మరో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ సైతం సీఎం రేవంత్‌ తీరుపై నిప్పులు చెరిగారు. కొంతమందికి మాత్రమే రుణమాఫీ చేసి… చేతులు దులుపుకున్న రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అదృష్టం కొద్దీ సీఎం అయ్యిన రేవంత్‌కి… ఉద్యమకారుడైన హరీష్‌ రావు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

మొత్తంగా… రుణమాఫీ సెంట్రిగ్‌గా అధికార, ప్రతిపక్షాల మధ్య డైలాగ్‌ వార్‌ ఓ రేంజ్‌లో నడుస్తోంది. మరీ రుణమాఫీ రగడ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి…!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?
హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?
రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
అలాంటి యాడ్స్‌ చేసినందుకు కొట్టాలి స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్!
అలాంటి యాడ్స్‌ చేసినందుకు కొట్టాలి స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్!
కూతురి కోసం తెగ కష్టపడుతున్న షారుఖ్.! వీడియో
కూతురి కోసం తెగ కష్టపడుతున్న షారుఖ్.! వీడియో
ఆమె మోజుతోనే బరి తెగించాడు.! అడ్డంగా బుక్కైన డీ - గ్యాంగ్
ఆమె మోజుతోనే బరి తెగించాడు.! అడ్డంగా బుక్కైన డీ - గ్యాంగ్
చై ఎంగేజ్‌మెంట్‌పై భర్తకు మద్దతుగా.. శ్రీవాణి సెటైరికల్ వీడియో.!
చై ఎంగేజ్‌మెంట్‌పై భర్తకు మద్దతుగా.. శ్రీవాణి సెటైరికల్ వీడియో.!
పెళ్లికి వేళాయెరా! హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
పెళ్లికి వేళాయెరా! హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!
బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!
సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..
సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..
దేవర యాక్షన్ ఎఫెక్ట్‌ NTRకు గాయం | ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.?
దేవర యాక్షన్ ఎఫెక్ట్‌ NTRకు గాయం | ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.?