కాళేశ్వరం పంప్‌ హౌస్‌లకు దేవతల పేర్లు! ఏంటో తెలుసా?

పంచాయతీ రాజ్‌ వ్యవస్థ బలోపేతంపై దృష్టి పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. గ్రామపంచాయతీ నుంచి జిల్లా పరిషత్‌ల వరకు ఎవరు ఏ విధులు నిర్వర్తించాలనే దానిపై పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈమేరకు అధికారులు , నిపుణులతో విస్తృతంగా చర్చంచి ముసాయిదా రూపొందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కేసీఆర్‌ ఆదేశించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజ్‌లు, పంపుహౌజులకు దేవతల పేర్లను ముఖ్యమంత్రి  ఖరారు చేశారు. మేడిగడ్డ బారాజ్‌కు లక్ష్మీ బారాజ్‌గా నామకరణం చేశారు. కన్నెపల్లి […]

కాళేశ్వరం పంప్‌ హౌస్‌లకు దేవతల పేర్లు! ఏంటో తెలుసా?
Follow us

|

Updated on: Aug 11, 2019 | 4:56 AM

పంచాయతీ రాజ్‌ వ్యవస్థ బలోపేతంపై దృష్టి పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. గ్రామపంచాయతీ నుంచి జిల్లా పరిషత్‌ల వరకు ఎవరు ఏ విధులు నిర్వర్తించాలనే దానిపై పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈమేరకు అధికారులు , నిపుణులతో విస్తృతంగా చర్చంచి ముసాయిదా రూపొందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కేసీఆర్‌ ఆదేశించారు.

ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజ్‌లు, పంపుహౌజులకు దేవతల పేర్లను ముఖ్యమంత్రి  ఖరారు చేశారు. మేడిగడ్డ బారాజ్‌కు లక్ష్మీ బారాజ్‌గా నామకరణం చేశారు. కన్నెపల్లి పంప్‌హౌజ్‌కు లక్ష్మీ పంప్‌హౌజ్‌ అన్నారం బారాజ్‌కు సరస్వతి బారాజ్‌ సిరిపురం పంప్‌హౌజ్‌కు సరస్వతి పంప్‌హౌజ్‌ సుందిళ్ల బారాజ్‌కు పార్వతి బారాజ్‌ గోలివాడ పంప్‌హౌజ్‌కు పార్వతి పంప్‌హౌజ్‌ నందిమేడారం రిజర్వాయర్‌ కమ్‌ పంప్‌హౌజ్‌కు నంది పేరును ఖరారు చేశారు. లక్ష్మీపురం పంప్‌హౌజ్‌కు గాయత్రిగా నామకరణం చేశారు. ఇదిలాఉంటే గత ప్రభుత్వాలు రాజకీయ ప్రముఖులు, వ్యక్తుల పేర్లను పెట్టడం ఆనవాయితీ. అయితే కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు కీలక ప్రాజెక్టులకు స్థానిక దేవాలయాల్లో కొలువైన దేవుళ్ల పేర్లను పెట్టే సంప్రదాయానికి తెరలేపారు. ఇందులో భాగంగానే భక్త రామదాసు ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు సైతం స్థానిక పుణ్యక్షేత్రం ఆధారంగానే నామకరణం చేయడం విశేషం.

Latest Articles
కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న గైక్వాడ్.. పంజాబ్ టార్గెట్ 163
కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న గైక్వాడ్.. పంజాబ్ టార్గెట్ 163
వేసవిలో చల్లచల్లగా కూల్‌ డ్రింక్స్‌ తాగేస్తున్నారా?
వేసవిలో చల్లచల్లగా కూల్‌ డ్రింక్స్‌ తాగేస్తున్నారా?
వేసవిలో పదే పదే విరేచనాలు అవుతున్నాయా? జాగ్రత్త..
వేసవిలో పదే పదే విరేచనాలు అవుతున్నాయా? జాగ్రత్త..
రిజర్వేషన్లపై బీజేపీ ఆలోచన ఏమిటో స్పష్టంగా చెప్పాలి.. సీఎం రేవంత్
రిజర్వేషన్లపై బీజేపీ ఆలోచన ఏమిటో స్పష్టంగా చెప్పాలి.. సీఎం రేవంత్
ఎన్నికల ప్రచారంలో ప్రతిధ్వనిస్తోన్న గాడిద గుడ్డు
ఎన్నికల ప్రచారంలో ప్రతిధ్వనిస్తోన్న గాడిద గుడ్డు
ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్
ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్
ఎవరైతే మాకేంటి.. ఏకంగా ఆమెనే టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు..
ఎవరైతే మాకేంటి.. ఏకంగా ఆమెనే టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు..
తీర్పు వెనక్కి తీసుకున్న సుప్రీం కోర్టు.. కారణం ఇదే.!
తీర్పు వెనక్కి తీసుకున్న సుప్రీం కోర్టు.. కారణం ఇదే.!
ఆస్తి విషయంలో కొడుకులకు షాక్ ఇచ్చిన తండ్రి.. యావత్ ఆస్తి ఎవరికంటే
ఆస్తి విషయంలో కొడుకులకు షాక్ ఇచ్చిన తండ్రి.. యావత్ ఆస్తి ఎవరికంటే
ఓయమ్మో.. !! మజిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ అందాలతో గత్తర లేపిందిగా..
ఓయమ్మో.. !! మజిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ అందాలతో గత్తర లేపిందిగా..