Siddipet: బావిలోకి దూసుకెళ్లిన కారు.. ప్రమాద సమయంలో ముగ్గురు వ్యక్తులు..

|

Sep 18, 2022 | 6:20 PM

తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సిరిసినగండ్ల, కొండపాక మధ్య జప్తి నాచారం శివారులో ఓ కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది.

Siddipet: బావిలోకి దూసుకెళ్లిన కారు.. ప్రమాద సమయంలో ముగ్గురు వ్యక్తులు..
Siddipet District
Follow us on

Car crashed into a well in Siddipet: తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సిరిసినగండ్ల, కొండపాక మధ్య జప్తి నాచారం శివారులో ఓ కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. బావిలో పడ్డ కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా.. స్థానికులు ఇద్దరిని కాపాడారు. కారులో మరొకరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. ఈ ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

కొండపాక స్టేజి వద్దకు వచ్చిన తమ బంధువులను ఇంటికి తీసుకురావడానికి సిరిసినగండ్లకు చెందిన వెంకటస్వామి, ఆయన ఇద్దరు బావలు కనకయ్య, యాదగిరి కారులో బయలుదేరారు. ఈ సమయంలో అతివేగంతో అదుపుతప్పిన కారు రహదారి పక్కనే ఉన్న పాడుబడిన బావిలోకి దూసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరిని స్థానికులు బయటకు తీశారు. వారిద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. కారులో చిక్కుకున్న సూరంపల్లికి చెందిన యాదగిరి (42) మృతిచెందినట్లు  పోలీసులు తెలిపారు.

కారును, మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాళ్ల సాయంతో కారును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. పాడుబడిన బావికావడం.. చుట్టూ చెట్లపొదలు ఉండడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..