MLA Etela Rajender: నాటికి నేటికి చాలా తేడా ఉంది.. సీఎం కేసీఆర్‌పై ఈటెల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు..

|

Jun 14, 2022 | 5:03 PM

ఒకప్పుడు కేసీఆర్‌ టీవీలో కనబడితే యువత కేరింతలు కొట్టేవారని.. ఇప్పుడు చీదరించుకుంటున్నారని అన్నారు. తాను పార్టీ మారలేదని, టీఆర్‌ఎస్‌ వాళ్ళే వెళ్లగొట్టారన్నారు.

MLA Etela Rajender: నాటికి నేటికి చాలా తేడా ఉంది.. సీఎం కేసీఆర్‌పై ఈటెల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు..
Etela Rajender
Follow us on

ఉద్యమం నాటి కేసీఆర్‌ (KCR)కు.. ఇప్పటి కేసీఆర్‌కు చాలా తేడా ఉందని హుజూరాబాద్ బీజేపీ(BJP) ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ (Etela Rajender) విమర్శించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండాభూదేవి గార్డెన్‌లో నిర్వహించిన ప్రధాని మోదీ 8 ఏళ్ళ ప్రజా సంక్షేమ పాలన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు కేసీఆర్‌ టీవీలో కనబడితే యువత కేరింతలు కొట్టేవారని.. ఇప్పుడు చీదరించుకుంటున్నారని అన్నారు. తాను పార్టీ మారలేదని, టీఆర్‌ఎస్‌ వాళ్ళే వెళ్లగొట్టారన్నారు. పదవుల కోసం పెదవులు ముసే దద్దమ్మలు టిఆర్ఎస్ వాళ్ళు.. టీఆర్ఎస్ పోయి బి ఆర్ ఎస్ వచ్చింది.. ఎనిమిది సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీని ప్రజలు వీఆర్ఎస్ తీసుకోవాలని కోరుతున్నారు. రెచ్చగొడితే ఆత్మగౌరవం కోసం రాజీనామా చేశానని స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యలపై చర్చకు సిద్ధమని అన్నారు. కాషాయ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరాలని చాలామంది ఎదురు చూస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు.

2018 ఎన్నికల చివరి ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ నాకు దేశ ప్రజలు తప్ప వారసత్వంగా ఎవరు లేరని చివరకు హిమాలయాలకు పోతా అని సందేశం ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం కేసిఆర్ కి గోళీలు ఇవ్వడానికి సంతోష్ కుమార్ కి రాజ్యసభ పదవి ఇచ్చారని.. ఆర్థిక వ్యవస్థ గొప్పగా ఉందని చెప్పే సీఎం గ్రామ, గ్రామాన బెల్ట్ షాప్స్ పెట్టీ త్రాగుడు ద్వారా 42వేల కోట్లు సంపాదించిందన్నారు.

ఇవి కూడా చదవండి

పబ్ ల ద్వారా ముక్కు పచలరాని అమ్మాయిల జీవితం అగమ్యగోచరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో జరుగుతున్న విష సంస్కృతినీ రేపు బిఆర్ ఎస్ ద్వారా దేశానికి పెంచుతావా అని ఈటల ప్రశ్నించారు. ఉద్యోగుల జీతాలు సరైన సమయంకు ఇవ్వడం లేని రాష్ట్ర ప్రభుత్వం అప్పు 5లక్షల కోట్లు అయితే అప్పుడే పుట్టిన పసికందు లక్షకు పైగా అప్పుతో పుడుతున్నారని విమర్శించారు.