రోజంతా సాధారణ కూలీగా సివిల్ సర్వెంట్.. ఎందుకు అలా చేశారంటే.!

గ్రామీణ పల్లెల్లో ఉపాధి లభించక రోజువారి కూలీకి వెళ్తుంటారు దినసరి కూలీలు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేకుండా ఖాళీగా ఉండే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. సాధారణంగా దినసరి కూలీలు, ఖాళీగా ఉండే వ్యక్తులు ఉపాధి హామీ పనికి వెళ్తుంటారు. గ్రామాల్లో దీనిని కరువు పని అని కూడా పిలుస్తుంటారు. ఉన్నతాధికారులు అంటేనే హంగూ ఆర్భాటం, దర్పం ఉంటుంది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాధారణ వ్యక్తిగా ఓ సివిల్ సర్వెంట్.. సూర్యాపేట జిల్లాలో ఓ గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి పనిచేశాడు.

రోజంతా సాధారణ కూలీగా సివిల్ సర్వెంట్.. ఎందుకు అలా చేశారంటే.!
Civil Servant
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 17, 2024 | 8:11 PM

గ్రామీణ పల్లెల్లో ఉపాధి లభించక రోజువారి కూలీకి వెళ్తుంటారు దినసరి కూలీలు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేకుండా ఖాళీగా ఉండే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. సాధారణంగా దినసరి కూలీలు, ఖాళీగా ఉండే వ్యక్తులు ఉపాధి హామీ పనికి వెళ్తుంటారు. గ్రామాల్లో దీనిని కరువు పని అని కూడా పిలుస్తుంటారు. ఉన్నతాధికారులు అంటేనే హంగూ ఆర్భాటం, దర్పం ఉంటుంది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాధారణ వ్యక్తిగా ఓ సివిల్ సర్వెంట్.. సూర్యాపేట జిల్లాలో ఓ గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి పనిచేశాడు. ఆ సివిల్ సర్వెంట్ ఎందుకు కూలీ పని చేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన సందీప్ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. చదువులో చురుకుగా ఉండే సందీప్ సివిల్స్ సర్వీస్ పరీక్షలు రాసి ఐఆర్‌ఎస్‎కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ ఐఆర్ఎస్ అధికారి బెంగళూరు సౌత్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనరేట్‌లోని జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ వింగ్ అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నిబద్ధత కలిగిన అధికారిగా ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచగలిగే బాధ్యతలను సందీప్ నిర్వర్తిస్తున్నారు.

Nrega

Nrega

గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన సందీప్ నిడారంబరంగా ఉంటాడు. సామాన్యుల మాదిరిగా సాధారణ జీవితం గడపాలని ఆయన భావిస్తుంటాడు. సివిల్ సర్వెంట్ అధికారిగా పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు ఏదో ఒకటి చేయాలని సందీప్ తాపత్రయ పడుతుంటాడు. తన రోజువారీ విధుల్లో బిజీగా ఉండే సందీప్‎కు సామాన్య ప్రజల కష్టాదుఃఖాలు, బాధలను తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్నాడు. హైదరాబాద్‎లో జరిగిన సెంట్రల్ సేల్ టాక్స్ సమావేశంలో పాల్గొనడానికి వచ్చాడు. సమావేశం తర్వాత సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామాన్ని సందర్శించాడు. గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో ఒక్కరోజు పనిచేస్తూ సాధారణ కూలిగా మారిపోయాడు. ఉపాధి హామీ కూలీల కష్టసుఖాలను తెలుసుకోవడంతోపాటు మధ్యాహ్నం కూలీలతో కలిసి భోజనం చేశారు.

కూలీలు, మహిళల స్వయం ఉపాధికి ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి కూలీలకు అవగాహన కల్పించారు. కూలీలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఆటపాటలతో ఉపాధి హామీ కూలీలతో కలిసిపోయి సందడి చేశారు. అంతేకాకుండా పనికి వచ్చిన 152 మంది కూలీలకు ఒకరోజు వేతనం రూ.200 చొప్పున 30,400 రూపాయలను సందీప్ తన నెలవారీ జీతం, పొదుపు ఖాతా నుంచి చెల్లించారు. ఉపాధి హామీ పథకం కూలీలతో ఒకరోజు పని చేసినందుకు ఆయన ఎలాంటి వేతనం తీసుకోలేదు. ఉన్నతాధికారిగా ఎలాంటి అధికార దర్పం లేకుండా తమతో కలిసి కూలి పని చేయడం ఆనందంగా ఉందని కూలీలు చెబుతున్నారు. సామాన్య వ్యక్తిలా పనిచేయడం ద్వారా కూలీల్లో ఆత్మగౌరవం, భరోసా పెరగడంతో పాటు స్వయం ఉపాధి దిశగా వారంతా ఆలోచించేందుకు సందీప్ చేసిన కృషిని పలువురు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Latest Articles
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
ప్రతిరోజూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? ఈ 4 వ్యాధులు గ్యారెంటీ..
ప్రతిరోజూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? ఈ 4 వ్యాధులు గ్యారెంటీ..
ఈ ఆకులతో ముఖంపై అలా చేస్తే చర్మం నిగనిగలాడాల్సిందే..
ఈ ఆకులతో ముఖంపై అలా చేస్తే చర్మం నిగనిగలాడాల్సిందే..
ఈ ఆకుల్ని తీసుకుంటే.. ఎంత షుగర్ ఉన్నా తగ్గాల్సిందే!
ఈ ఆకుల్ని తీసుకుంటే.. ఎంత షుగర్ ఉన్నా తగ్గాల్సిందే!
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
ఆ అభిమానిని కలిసిన నాగ్.. క్షమాపణలు చెప్పి హగ్ ఇచ్చి.. వీడియో
ఆ అభిమానిని కలిసిన నాగ్.. క్షమాపణలు చెప్పి హగ్ ఇచ్చి.. వీడియో
పురుషుల కోసం ట్రెండీ సన్‌గ్లాసెస్ ఇవి.. వాడితే ఇలాంటివే వాడాలి..
పురుషుల కోసం ట్రెండీ సన్‌గ్లాసెస్ ఇవి.. వాడితే ఇలాంటివే వాడాలి..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
ఊహించని ట్విస్ట్.. అక్కడ ఐమాక్స్‌లో కల్కి2898 AD షోలు రద్దు..
ఊహించని ట్విస్ట్.. అక్కడ ఐమాక్స్‌లో కల్కి2898 AD షోలు రద్దు..
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!
అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు
అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు
పెరుగు, చక్కెర కలిపి తింటున్నారా ?? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
పెరుగు, చక్కెర కలిపి తింటున్నారా ?? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
జుట్టు రాలకుండా.. ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి
జుట్టు రాలకుండా.. ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి