కోడలిపై అఘాయిత్యం.. బాధను దిగమింగిన వివాహిత.. ఆపై కోర్టు సంచలన తీర్పు..

వావి వరసలు తప్పి కొడలు వరసయ్యే మహిళపై రేప్ అటెంప్ట్ చేసిన ఓ ప్రబుద్దిడికి 10 ఏళ్ల జైలు శిక్ష వేసింది ఆసిఫాబాద్ జిల్లా సెషన్ కోర్టు. అంతేకాదు రూ. 20 వేల జరిమానా కూడా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ముకుందరావు తనకు కోడలి వరస అయ్యే వివాహితపై కన్నేశాడు. ఆమె ఒంటిరిగా ఉన్నప్పుడు తప్పుగా ప్రవర్తిస్తూ ఉండేవాడు.

కోడలిపై అఘాయిత్యం.. బాధను దిగమింగిన వివాహిత.. ఆపై కోర్టు సంచలన తీర్పు..
Asifabad Court
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 22, 2024 | 8:57 PM

వావి వరసలు తప్పి కొడలు వరసయ్యే మహిళపై రేప్ అటెంప్ట్ చేసిన ఓ ప్రబుద్దిడికి 10 ఏళ్ల జైలు శిక్ష వేసింది ఆసిఫాబాద్ జిల్లా సెషన్ కోర్టు. అంతేకాదు రూ. 20 వేల జరిమానా కూడా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ముకుందరావు తనకు కోడలి వరస అయ్యే వివాహితపై కన్నేశాడు. ఆమె ఒంటిరిగా ఉన్నప్పుడు తప్పుగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. కోరిక తీర్చాలంటూ నిత్యం వేధింపులకు పాల్పడుతూ ఉండేవాడు. అతడి గురించి బయటకు చెప్తే.. కుటుంబం పరువు పోతుందని ఆమె మనసులోని మదనపడుతూ ఉండేది. ఇక ఆమె తనకు దక్కని నిర్ణయించుకున్నాక.. ముకుందరావు వివాహితపై కక్ష పెంచుకున్నాడు. వేరే వాళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఊరంతా ప్రచారం చేశాడు. అయినా ఆమె నిందలను భరించింది తప్పితే.. తన మనసులోని బాధను బయటకు చెప్పుకోలేదు.

అయితే.. 2021, జనవరి 5 న రాత్రి సమయంలో.. ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించి.. వివాహిత ఇంట్లోకి చొరబడ్డాడు ముకుందరావు. ఆపై ఆమెను బెదిరించి.. లైంగిక దాడికి యత్నించాడు. సరిగ్గా అదే సమయానికి బాధితురాలి భర్త రావటంతో.. అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు ముకుందరావు. దీంతో.. భార్య ఇన్నాళ్లు తాను అనుభవించిన వేదిన భర్తకు చెప్పి బోరుమంది. భర్త మద్దతులో పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. విచారించిన ధర్మాసనం.. సాక్ష్యాధారాలను పరిశీలించి.. ముకుందరావును దోషిగా తేల్చింది. 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 20 వేల రూపాయల జరిమాన విధిస్తూ ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ తీర్పు ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!