Telangana: భర్త లేని సమయంలో వివాహితతో డిప్యూటీ త‌హసీల్దార్ తప్పుడు ప్రవర్తన.. ఆమె ఏం చేసిందంటే..

|

Apr 18, 2024 | 2:42 PM

అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్న డిప్యూటీ త‌హ‌సీల్దార్ చెంప ఛెల్లుమ‌నిపించింది ఓ మ‌హిళ‌. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఘ‌ట‌న నారాయ‌ణ‌ఖేడ్ ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి....

Telangana: భర్త లేని సమయంలో వివాహితతో డిప్యూటీ త‌హసీల్దార్ తప్పుడు ప్రవర్తన.. ఆమె ఏం చేసిందంటే..
Deputy Tahsildar Booked
Follow us on

అతనో తహసీల్దార్. బాధ్యతాయుతమైన పోస్ట్‌లో ఉన్న వ్యక్తి. సమాజానికి ఆదర్శంగా ఉండాలి. కానీ ట్రాక్ తప్పాడు. పక్కనే నివాసం ఉంటున్న ఓ మహిళ పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నాడు. ఆమె ఓపిక పట్టినన్ని రోజులు పట్టింది. ఆపై సహనం నశించి.. చెంపపై చాచి పెట్టి కొట్టింది. ఈ ఘటన నారాయ‌ణ‌ఖేడ్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవతున్నాయి.

నారాయ‌ణ‌ఖేడ్ ప‌ట్ట‌ణంలోని ఓ ఇంట్లో డిప్యూటీ త‌హసీల్దార్ నివాస‌ముంటున్నాడు. అయితే ప‌క్క పోర్ష‌న్‌లో నివాస‌ముంటున్న ఓ వివాహిత ప‌ట్ల డిప్యూటీ త‌హ‌సీల్దార్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమె భర్త లేని సమయంలో.. వెకిలిగా మాట్లాడటంతో పాటు లైంగికంగా వేధింపుల‌కు గురి చేస్తున్నాడు. అంతేకాకుండా ఫోన్‌లో వీడియోలు, ఫోటోలు తీస్తూ వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధిత మహిళ ఆరోపించింది. డిప్యూటీ త‌హ‌సీల్దార్ వేధింపులు భ‌రించ‌లేని.. ఆమె అత‌ని చెంపపై ఒక్కటిచ్చింది. అనంత‌రం త‌న భ‌ర్త‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. డిప్యూటీ త‌హ‌సీల్దార్‌పై బాధితురాలి భ‌ర్త పోలీసుల‌కు కంప్లైంట్ చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..