Breaking News : ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్‌కు 19 లక్షల 33 వేల దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Breaking News : ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Follow us

|

Updated on: Oct 15, 2020 | 11:15 PM

LRS Applications : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్‌కు 19 లక్షల 33 వేల దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

లేఔట్‌ క్రమబద్ధీకరణ పథకం (LRS) దరఖాస్తుల గడువు గురువారంతో ముగిసింది. అయితే మరో నెల రోజులపాటు దరఖాస్తుల గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో మీ–సేవా కేంద్రాలు మూతపడి చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ పరిస్థితుల దృష్ట్యా గడువు పొడిగింపు అనివార్యమని ప్రభుత్వం భావించింది. కాగా, బుధవారం రాత్రి నాటికి మొత్తం 16,28,844 దరఖాస్తులు వచ్చాయి. పురపాలికల్లో 6,67,693, మున్సిపాలిటీల్లో 6,70,085, కార్పొరేషన్లలో 2,91,066 దరఖాస్తులొచ్చాయి.