AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart Sale: ఈ ఫీచర్లు లేకపోతే.. ఫోన్ కొని ఉపయోగం లేదు!

ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లో జరిగే ఫెస్టివల్ సేల్ లో చాలామంది ఆఫర్ల మోజులో పడి.. డిస్కౌంట్ ఎక్కువగా ఉన్న ఫోన్ కొనేస్తుంటారు. అయితే ఫోన్ కొనేముందు చూడాల్సింది ఆఫర్లు, డిస్కౌంట్లు కాదు. మరేం చూడాలి అనేగా మీ డౌట్.. ఇప్పుడు తెలుసుకుందాం.

Flipkart Sale: ఈ ఫీచర్లు లేకపోతే.. ఫోన్ కొని ఉపయోగం లేదు!
Flipkart Sale Mobile Buying
Nikhil
|

Updated on: Sep 25, 2025 | 4:29 PM

Share

కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నప్పుడు కేవలం ధర ఒక్కటే కాకుండా అందులో లేటెస్ట్‌గా వస్తున్న టెక్నాలజీ ఉందా లేదా? 2025కి తగ్గ ఫీచర్లు అందులో ఉన్నాయా లేదా అన్నది తెలుసుకుని కొనాలి. స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సిన ఫీచర్లు, ఆప్షన్లు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రాసెసర్

మొబైల్ కొనేటప్పుడు ముందుగా చెక్ చేసుకొవాల్సింది ప్రాసెసర్. ఫోన్ కు గుండె వంటిది ఈ ప్రాసెసర్.  ప్రస్తుతం మార్కెట్లో క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్, మీడియాటెక్, శాంసంగ్ ఎక్సినోస్ వంటి పలు ప్రాసెసర్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఏయే ప్రాసెసర్ ఎంత ధరలో లభిస్తుందో తెలుసుకోవాలి. మంచి ప్రాసెసర్ తక్కువ ధరకు లభిస్తే అది మంచి డీల్ అన్నట్టు లెక్క.

డిస్ ప్లే

మొబైల్ కొనేముందు చూసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం డిస్‌ప్లే. వీటిల్లో ఎల్‌సీడీ, ఎల్‌ఈ డీ, అమోలెడ్.. ఇలా పలు రకాలున్నాయి. వీటిలో ఎల్‌ఈడీ, అమోలెడ్ అనేవి లేటెస్ట్ టెక్నాలజీ డిస్‌ప్లేలు. ఎల్ సీడీ కాస్త పాత టెక్నాలజీ. అంత క్వాలిటీ ఉండకపోవచ్చు. స్క్రీన్ అలాగే రిజల్యూషన్ విషయంలో మినిమమ్ ఫుల్ హెచ్‌డీ లేదా అంతకుమించి..  అంటే 2కె, 4కె వంటివి ఎంచుకోవాలి. కేవలం నార్మల్ హెచ్‌డీ డిస్ ప్లే తీసుకోవడం వల్ల డిస్ ప్లే క్వాలిటీ బాగుండదు. అలాగే రీఫ్రెష్ రేటు కూడా మినిమం 90 హెర్ట్జ్ ఉండాలి.

కెమెరా

ఈ రోజుల్లో ఫోన్‌ లో కెమెరా అన్నది చాలా ముఖ్యం. అయితే  కెమెరా విషయంలో మొబైల్ కంపెనీలు మోసం  చేస్తుంటాయి. మెగాపిక్సెల్స్ ఎక్కువ ఉంటే మంచి కెమెరా అన్నట్టు ప్రమోట్ చేస్తుంటాయి. కానీ, అది నిజం కాదు. ఫొటో క్వాలిటీ అనేది సెన్సర్ ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు చైనీస్ బ్రాండ్స్ మొబైల్స్‌లో 200 ఎంపీ కెమెరా కన్నా.. శాంసంగ్ ఎస్ సిరీస్‌, ఐఫోన్స్ లోని 16 ఎంపీ కెమెరాలు మంచి పెర్ఫామెన్స్ ఇస్తాయి.  కాబట్టి కెమెరా క్వాలిటీని గూగుల్ లో చెక్ చేసి తీసుకోవడం బెటర్.

స్టోరేజ్, బ్యాటరీ

ఇకపోతే మొబైల్‌లో బ్యాటరీ అనేది చాలా కీలకమైన భాగం. కాబట్టి బ్యాటరీ కెపాసిటీ మినిమమ్ 5000 ఎంఏహెచ్ ఉండేలా చూసుకోవాలి. అలాగే ర్యామ్ కనీసం 4జీబీ లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాగే ఇంటర్నల్ స్టోరేజీ 64 జీబీ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మంచిది.

మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రూ.4.5లక్షలకే అద్దిరిపోయే ఇల్లు..! ఇటుకలు, రాళ్ల కన్నా ఎంతో బలంగా
రూ.4.5లక్షలకే అద్దిరిపోయే ఇల్లు..! ఇటుకలు, రాళ్ల కన్నా ఎంతో బలంగా
ఫైనల్ మ్యాచ్ లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులతో బరిలోకి..!
ఫైనల్ మ్యాచ్ లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులతో బరిలోకి..!
మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..
మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..
బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!
బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!
ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం
ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం
నేనే గనక త్రిష స్థానంలో ఉంటే సీనియర్ నటి అంబిక కామెంట్స్ వైరల్
నేనే గనక త్రిష స్థానంలో ఉంటే సీనియర్ నటి అంబిక కామెంట్స్ వైరల్
తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేయడం ఎలా..? చిట్కాలు ఇవిగో..
తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేయడం ఎలా..? చిట్కాలు ఇవిగో..
బంగారం దీవి.. మాల్దీవులను మర్చిపోయేలా చేసే అద్భుతం..! ఎక్కడంటే...
బంగారం దీవి.. మాల్దీవులను మర్చిపోయేలా చేసే అద్భుతం..! ఎక్కడంటే...
తీవ్ర కుదుపుల మధ్య ల్యాండింగ్..తెరుచుకున్న లగేజ్ క్యాబిన్లు..!
తీవ్ర కుదుపుల మధ్య ల్యాండింగ్..తెరుచుకున్న లగేజ్ క్యాబిన్లు..!