కూలర్ బాక్స్ లాగా కనిపించే ఈ వస్తువు ఏంటో మీకు తెలుసా? అసలు విషయం తెలిస్తే మీరు షాకవుతారు. నిజానికి ఇదొక బ్యాటరీ. 6 నెలల పాటు కరెంటు ఇచ్చే విధంగా శాస్త్రవేత్తలు దీనిని తయారు చేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ(Cambridge University)కి చెందిన కంప్యూటర్ ప్రాసెసర్‌కి ఈ బ్యాటరీని కనెక్ట్ చేశారు. ఇది 6 నెలల పాటు నిరంతరాయంగా పనిచేస్తోంది. ఈ బ్యాటరీ షెల్ AA బ్యాటరీ కంటే చిన్నదే కావడం విశేషం. పరిశోధకులు బ్లూ-గ్రీన్ ఆల్గే(Algae)ను ఎలక్ట్రోడ్‌ల (Electrodes)తో కూడిన కంటైనర్‌లో ఉంచారు. విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సూక్ష్మజీవులు సూర్యరశ్మిని ఉపయోగించాయి. ఈ బ్యాటరీ కంప్యూటర్‌ను నడపడానికి తగినంత శక్తిని ఇచ్చింది. అలాగే ఈ కంప్యూటర్‌ను 6 నెలల పాటు నిరంతరంగా నడిపిస్తూనే ఉండడం గమనార్హం.
జర్నల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ ప్రకారం, సైనోబాక్టీరియా కంప్యూటర్‌ను 45 సైకిల్స్‌లో అమలు చేసేందుకు అనుమతించింది. ఇది కేవలం15 నిమిషాల్లోనే సిద్ధమైంది. ఆగస్ట్ 2021 నుంచి బ్యాటరీ విద్యుత్తును ఉత్పత్తి చేయడం కొనసాగిస్తూనే ఉంది.
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని బయోకెమిస్ట్రీ విభాగానికి చెందిన డాక్టర్ పాలో బొంబెల్లి మాట్లాడుతూ, సిస్టమ్ చాలా కాలం పాటు నిరంతరం పని చేయడం మాకు నచ్చిందని చెప్పుకొచ్చారు. ఇది కొన్ని వారాల తర్వాత ఆగిపోవచ్చని మేం భావించాం. కానీ, అది కొనసాగుతూనే ఉంది.
ఆరు నెలలపాటు అంతరాయం లేకుండా నడిచిన ఈ సిస్టమ్, కంప్యూటింగ్ సమయంలో 0.3 మైక్రోవాట్‌ల శక్తిని, పనిలేకుండా ఉండే సమయంలో 0.24 శక్తిని వినియోగించుకుంది.
అయితే, ఇది ఎలా పనిచేస్తుందో స్పష్టంగా తెలియదు. కానీ, కిరణజన్య సంయోగక్రియ సమయంలో సైనోబాక్టీరియా (బ్లూ-గ్రీన్ ఆల్గే) ఎలక్ట్రాన్‌లను విడుదల చేస్తుందని బృందం భావిస్తోంది. కానీ, వెలుతురు లేకపోవడంతో విద్యుత్‌పై ప్రభావం కూడా పడలేదు. పగలు, రాత్రి సమయాల్లోనూ స్థిరంగా పనిచేస్తూనే ఉంది. ఆల్గే తమ ఆహారాన్ని చీకటిలో ప్రాసెస్ చేయడం దీనికి కారణం కావచ్చని అనుకుంటున్నారు. విద్యుత్ ప్రవాహం ఉత్పత్తి ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఈ ఆల్గే-ఆధారిత బ్యాటరీలు ఇంటికి శక్తినివ్వడానికి ఇప్పటికైతే సరిపోవు. అయినప్పటికీ అవి చిన్న ఉపకరణాలకు మాత్రం శక్తినివ్వగలవు. ఇది చౌకగా ఉంటుంది. రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారు చేశారు. ఇటువంటి బ్యాటరీలు రాబోయే కాలంలో గేమ్ ఛేంజర్‌గా మారగలవు.
A Computer Powered By An Algae Battery Ran For A Whopping Six Monthshttps://t.co/KvDPCVSee1 pic.twitter.com/lWa71VNzuf
— IFLScience (@IFLScience) May 14, 2022
Also Read: Laptop: ల్యాప్‌టాప్ చార్జింగ్ త్వరగా అయిపోతోందా.? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే బెస్ట్ రిజల్ట్స్..