AI project Jarvis: కంప్యూటర్ సేవకుడు వచ్చేస్తున్నాడు.. పనులన్నీ చిటికెలో ఫినిష్..!

|

Nov 02, 2024 | 3:45 PM

ఆధునిక కాలంలో ప్రతి పనికీ కంప్యూటర్ అవసరమవుతోంది. దాని ద్వారా ఇంటర్నెట్ ను ఉపయోగించి, ఇంట్లోనే కూర్చుని అన్ని పనులు చేసుకునే వీలు కలుగుతోంది. ఆన్ లైన్ షాపింగ్, టిక్కెట్ల బుక్కింగ్, బ్యాంకు లావాదేవీలు, విద్యుత్ తదితర బిల్లుల చెల్లింపు.. అంతా క్షణాల్లో జరిగిపోతోంది. ఇంటర్నెట్ లో వెబ్ పేజీలకు యాక్సెస్ చేయడానికి వెబ్ బ్రౌజర్ చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా వివిధ వెబ్ సైట్ల లింక్ లను క్లిక్ చేసి మనకు అవసరమైన పనులు చేసుకోవచ్చు.

AI project Jarvis: కంప్యూటర్ సేవకుడు వచ్చేస్తున్నాడు.. పనులన్నీ చిటికెలో ఫినిష్..!
Ai Project Jarvis
Follow us on

ప్రస్తుతం గూగుల్ క్రోమ్ అనే వెబ్ బ్రౌజర్ ను ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే వెబ్ బ్రౌజర్ లో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించే ఒక రహస్య ప్రాజెక్టుపై గూగుల్ పనిచేస్తుంది. దానికి ప్రాజెక్టు జార్విస్ అనే పేరు పెట్టింది. ఉత్పత్తులను కొనుగోలు చేయడం, పరిశోధనను సేకరించడం, విమానాల టికెట్లను బుక్ చేయడం వంటి వాటిని ఈ కొత్త ఏఐ సిస్టమ్ చాలా సులభంగా చేయగలరు. గూగుల్ విడుదల చేసే కొత్త వెర్షన్ లో ప్రాజెక్టు జార్విస్ సేవలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. దీన్ని ప్రత్యేకంగా గూగుల్ క్రోమ్ లో పనిచేసేలా సర్దుబాటు చేస్తారు. దీని ఏఐ ఏజెంట్ గా పిలవొచ్చు. యూజర్ తరఫున అనేక విధులను నిర్వహించడానికి సహాయ పడుతుంది. వెబ్ ఆధారంగా చేసే రోజు వారీ పనులను ఆటోమేటిక్ గా నిర్వహిస్తుంది.

ఉదాహరణకు మీరు విమానం టిక్కెట్ బుక్ చేయాలనుకున్నారు. ముందుగా ఆ వెబ్ సైట్ ను ఎంచుకుంటారు. ఆపై మీరు ఎక్కే ఫ్లైట్ గురించి వెతుకుతారు. ధర వివరాలను తెలుసుకుని, ఇతర వెబ్ సైట్లను సందర్శిస్తారు. ఎక్కడ టిక్కెట్ ధర అనుకూలంగా ఉంటే అక్కడ బుక్ చేసుకుంటారు. ప్రాజెక్టు జార్విస్ లోని ఏఐ సాధనం ఈ పనులన్నింటినీ ఆటోమేటిక్ గా చేసేస్తుంది. మీకు అనుకూలమైన ఉత్తమ ఎంపికలను అందజేస్తుంది. గూగుల్ రూపొందిస్తున్న ఏఐ ఏజెంట్ మీ కంప్యూటర్ పూర్తిగా స్వాధీనం చేసుకుంటుంది. అంటే మీ బదులు అన్ని పనులు నిర్వహిస్తుంది. దీని వల్ల ఎటువంటి అనర్థాలు కలగవు. ఐరన్ మ్యాన్ సినిమాలలో జార్విస్ క్యారెక్టర్ నుంచి ఈ పేరును తీసుకున్నారు. ప్రాజెక్టు జార్విస్ అనేది వినియోగదారు ఫేసింగ్ ఫీచర్ గా గూగుల్ క్రోమ్ లో పనిచేస్తుంది. రోజు వారీ వెబ్ ఆధారిత పనులను ఆటోమేటిక్ నిర్వహిస్తుంది.

ఇది డిసెంబర్ నాటికి సిద్ధం కావచ్చని నివేదికలు చెబుతున్నాయి. ప్రాజెక్టు జార్విస్ తో యూజర్లు తమ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. దీని ఆధారంగా చాలా సులువుగా పనులను నిర్వహించుకోవచ్చు. అదే సమయంలో ఏఐపై ఎక్కువగా ఆధారపడడం వల్ల స్వయంగా కనుగొనే సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి