Tecno Pova 6 Neo: గేమ్‌ ఛేంజర్‌ స్మార్ట్‌ఫోన్‌.. బడ్జెట్‌లో మునుపెన్నడూ లేని ఫీచర్స్‌

టెక్నో పోవా 6 నియో పేరుతో త్వరలోనే భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఏఐ టెక్నాలజీకి పెద్ద పీట వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఫోన్‌లో ఏఐ సూట్‌, ఏఐ కటౌట్‌, ఏఐ మ్యాజిక్‌ ఎరేజర్‌, ఏఐ ఆర్ట్‌బోర్డ్‌ వంటి ఫీచర్లను అందించనున్నారు. ఇక ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను...

Tecno Pova 6 Neo: గేమ్‌ ఛేంజర్‌ స్మార్ట్‌ఫోన్‌.. బడ్జెట్‌లో మునుపెన్నడూ లేని ఫీచర్స్‌
Tecno Pova 6 Neo
Follow us

|

Updated on: Sep 07, 2024 | 5:57 PM

మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌ల హవా నడుస్తోంది. అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను కంపెనీలు తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ విస్తృతి పెరిగిన తర్వాత ఈ టెక్నాలజీకి సపోర్ట్‌ చేసే ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నారు. అయితే అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను కూడా తక్కువ ధరకే తీసుకొస్తున్నాయి కంపెనీలు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం టెక్నో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. తక్కువ బడ్జెట్‌లోనే కళ్లు చెదిరే ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టెక్నో పోవా 6 నియో పేరుతో త్వరలోనే భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఏఐ టెక్నాలజీకి పెద్ద పీట వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఫోన్‌లో ఏఐ సూట్‌, ఏఐ కటౌట్‌, ఏఐ మ్యాజిక్‌ ఎరేజర్‌, ఏఐ ఆర్ట్‌బోర్డ్‌ వంటి ఫీచర్లను అందించనున్నారు. ఇక ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం.

ఈ ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో జీ99 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. టెక్నో పోవా 6 నియోను 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ వేరియంట్‌, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో తీసుకొస్తున్నారు. టెక్నో పోవా 6 నియో గ్లోబల్‌ మార్కెట్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు ఇండియన్‌ వేరియంట్‌లో ఈ ఫోన్‌లో 108 ఎంపీతో కూడిన ఏఐ కెమెరాను ఇవ్వనున్నారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 33 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 7000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

ఈ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్‌ 11వ తేదీన లాంచ్‌ చేయనున్నట్లు సమాచారం. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 15 వేలలోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. టాప్‌ ఎండ్‌ ధర ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫోన్‌ ప్రముఖ ఈకామర్స్‌ సైట్‌ అమజాన్ ద్వారా అందుబాటులోకి రానుంది. త్వరలోనే ఈ ఫోన్‌ లాంచింగ్‌కు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!