ఇంటర్నెట్ యుగంలో సైబర్ మోసాలు చేయడం చాలా తేలికగా మారింది. హ్యాకర్లు కొత్త ట్రాప్‌లు వేస్తూ విభిన్న మార్గాలను అన్వేషిస్తున్నారు
TV9 Telugu
నేటి కాలంలో ప్రపంచమంతా ఫోన్లలో నిక్షిప్తమైఉంది. అందుకే స్మార్ట్‌ఫోన్‌లను టార్గెట్ చేస్తున్నారు కేటుగాళ్లు. మాల్‌వేర్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా ఫోన్ హ్యాకింగ్ చేస్తున్నారు
TV9 Telugu
Darkgate, Emote, LokiBot—మీ ఫోన్‌ని హ్యాక్ చేయగల వివిధ రకాల మాల్వేర్‌లు ఇవి. హ్యాకర్లు మీకు తెలియకుండానే ఈ మాల్వేర్లను ఉపయోగించి మీ డేటాను దొంగిలిస్తున్నారు. అయితే దాన్ని ఎలా నివారించాలి?
TV9 Telugu
మీరు డౌన్‌లోడ్ చేయని యాప్ మీ ఫోన్‌లో ఉంటే, దాన్ని చూసిన వెంటనే దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. ఏ యాప్‌ని దాని ప్రామాణికతను ధృవీకరించకుండా ఇన్‌స్టాల్ చేసుకోకూడద. ఇది ఫోన్ నుంచి డేటాను దొంగిలించవచ్చు. పైగా ఫోన్ స్పీడ్‌నూ తగ్గిస్తుంది
TV9 Telugu
హ్యాకింగ్ సమయంలో చాలా అనవసరమైన యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటాయి. కాబట్టి భయపడకుండా ఫోన్‌ను రీసెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ప్రమాదాన్ని తగ్గిస్తుంది
TV9 Telugu
ఫోన్ వేడెక్కితే, స్పైవేర్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుందని అర్ధం. బ్యాక్‌గ్రౌండ్‌లో మాల్వేర్ నిరంతరం రన్ అవుతుండటం వల్ల ఫోన్ బాగా వేడెక్కుతుంది. ఇది మీకు తెలియకుండానే డేటాను దొంగిలిస్తుంది
TV9 Telugu
ఎప్పుడో అప్పుడు పొరపాటున వేలు తగిలి కాల్ వెళ్లటం అనుభవమే. కానీ కాల్ హిస్టరీలో మనకు తెలియని నంబర్లు కనిపిస్తే అప్రమత్తం కావాల్సిందే. ఫోన్ తనకు తానే ఇష్టమొచ్చినట్టు కాల్స్ చేస్తున్నా, మెసేజ్‌లు పంపిస్తున్నా హ్యాక్ అయ్యిండొచ్చని అనుమానించాలి
TV9 Telugu
ఫోన్ వై-ఫై, మొబైల్ డేటాను టర్న్‌ఆఫ్ చేయాలి. దీంతో మోసగాళ్లకు ఫోన్ మీద మరింత ఆధిపత్యం దక్కకుండా చేయొచ్చు. ఫోన్‌లోని మాల్వేర్‌ను గుర్తించి, తొలగించటానికి యాంటీ-మాల్వేర్ సాఫ్ట్‌వేర్‌ని తరచూ రన్ చేస్తుండాలి. లేదంటే యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసి, రన్ చేయాలి