దేశంలోని చాలా మంది రైడ్‌ను బుక్ చేసుకోవడానికి వేర్వేరు ఫోన్‌లలోని వివిధ యాప్‌ల ధరలను సరిపోల్చుకుంటారు.
స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో ఉన్నా, వేర్వేరు ఫోన్‌లలో క్యాబ్‌ని బుక్ చేసుకుంటూ ఉంటారు. ఎవరి ఫోన్‌లో ఎంత ఛార్జ్ చూపుస్తుందో చూసుకుంటారు.
ఏ ఫోన్ యాప్‌లో ఛార్జీ తక్కువగా కనిపిస్తే , ఆ క్యాబ్ బుక్ చేసుకుంటూ ఉంటారు. అన్ని క్యాబ్ అప్లికేషన్‌ల ఛార్జీలను చూడగలిగే యాప్ గురించి చెప్పబోతున్నాము.
నిజానికి, ఇది క్యాబ్ కంపేర్ బీటా యాప్. ఈ యాప్ Ola-Uber వంటి ప్రసిద్ధ టాక్సీ సేవల ధరలు, లభ్యతను పోల్చి చూస్తుంది.
ఈ యాప్ టాక్సీ బుకింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా చేస్తుంది. దీనితో మీరు అన్ని అప్లికేషన్‌లలో ఛార్జీలను చూడవచ్చు.
మీ బడ్జెట్ ప్రకారం రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా రైడ్ బుక్ చేసుకోవడంపై మీకు తగ్గింపు కూడా లభిస్తుంది.
ముందుగా అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసి లాగిన్ అయ్యి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో, ఎక్కడి నుండి క్యాబ్‌ని బుక్ చేసుకుంటున్నారో అక్కడ పికప్, గమ్యస్థానాన్ని ఎంచుకోండి.
ధరలను సరిపోల్చడానికి మీ ఖాతాలను యాప్‌లకు లింక్ చేయండి. కార్/ఆటో/బైక్/SUVలో రైడ్‌లను ఫిల్టర్ చేయండి. మీ క్యాబ్‌ను బుక్ చేయండి.