ఈ 5 తప్పులు చేసేవారిపై వాట్సాప్‌ నిషేధం..!

05 September 2024

Battula Prudvi 

వాట్సాప్‌ ఖాతాలను ఎందుకు నిషేధిస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? మీరు చేసే తప్పుల కారణంగా ఇది బ్లాక్ అవడం జరుగుతుంది.

ప్రతి నెల వాట్సాప్ నెలవారీ నివేదిక వస్తుంది. ఈ నివేదిక ఏ నెలలో కంపెనీ ఎన్ని ఖాతాలను నిషేధించింది? అనే విషయాలు వెల్లడిస్తుంది.

ఈ ఐదు తప్పులు చేస్తే ఆ ఖాతాలను వాట్సాప్‌ నిషేధిస్తుంది. ఇప్పటికే కొంతమంది కథలను నిషేదించింది వాట్సాప్ సంస్థ.

మీరు వాట్సాప్‌లో చాట్ ద్వారా ఒక వ్యక్తిపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తుంటే, మీ ఖాతాను సంస్థ నిషేధించవచ్చు.

వాట్సాప్‌లో నకిలీ వార్తలను ఫార్వార్డ్ చేయడం మానుకోవాలి. వినియోగదారులు ఎవరైనా మీ ఖాతాపై రిపోర్ట్ చేసినట్లయితే, మీ ఖాతా నిషేధించబడవచ్చు.

వాట్సాప్‌లో ఏదైనా వినియోగదారుకు అశ్లీల కంటెంట్‌ను పంపడం లేదా ఫార్వార్డ్ చేయడం తప్పు. అలా చేస్తే నిషేధం విధించవచ్చు.

గ్రూప్‌నకు యూజర్‌లను యాడ్ చేసే ముందు తప్పనిసరిగా వారి అనుమతి తీసుకోవాలి. లేకుంటే ఎవరైనా మీ ఖాతాను రిపోర్ట్ చేస్తే, మిమ్మల్ని నిషేధించవచ్చు.

వాట్సాప్‌లో మీకు తెలిసిన వ్యక్తులకు మాత్రమే మెసేజ్ చేయండి. తెలియని వ్యక్తికి మెసేజ్ చేస్తే, వారు రిపోర్ట్ చేసినట్లయితే ఖాతాను నిషేధించవచ్చు.