వైఫై, హాట్‌స్పాట్ మధ్య తేడాలేంటి..?
01 September 2024
Battula Prudvi
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు చాలా మంది చేతుల్లోకి వచ్చాయి. వ్యక్తులు తరచుగా స్మార్ట్‌ఫోన్‌లలో వైఫై లేదా హాట్‌స్పాట్ వంటి పదాలను ఉపయోగిస్తారు.
కానీ చాలా మందికి మనం స్మార్ట్‌ఫోన్లులో తరుచు ఎక్కువగా ఉపయోగిస్తున్న వైఫై, హాట్‌స్పాట్ మధ్య తేడా తెలియదు.
వైఫై, హాట్‌స్పాట్ రెండూ వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్షన్‌ని చేయడానికి మార్గాలు. కానీ వైఫై సిస్టమ్ వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్ రిసీవర్.
అయితే మొబైల్ ఉన్న హాట్‌స్పాట్ వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
సరళమైన భాషలో అర్థమయ్యేలా వివరించాలంటే, ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయడానికి స్మార్ట్‌ఫోన్‌లలో WiFi ఉపయోగిస్తారు.
ఇతరులకు మీ దగ్గర ఉన్న ఏ నెట్వర్క్ అయినా ఇంటర్నెట్ అందించడానికి స్మార్ట్‌ఫోన్‌లో హాట్‌స్పాట్ ఉపయోగిస్తారు.
చాలా స్మార్ట్‌ఫోన్‌లు వైఫై, హాట్‌స్పాట్ రెండింటినీ ఒకేసారి యాక్సెస్ చేసే సదుపాయాన్ని అందిస్తున్నాయి.
మీరు వైఫై ద్వారా ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తునే హాట్‌స్పాట్ ద్వారా ఇంకొకరికి షేర్ చెయ్యవచ్చు. దీంతో అన్ని సులభతరం అయ్యాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి