AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: ఈ సెట్టింగ్‌ మారిస్తే మీ వాట్సాప్‌ ఓపెన్‌ ఉన్నా మెసేజ్‌లను ఎవ్వరు చదవలేరు!

Tech Tips: ఈ విధంగా మీరు ఆ వాట్సాప్ చాట్‌లను లాక్ చేయవచ్చు. దీన్ని మీ ఫోన్ బయోమెట్రిక్స్ - ఫేస్‌, వేలిముద్ర ద్వారా మాత్రమే ఓపెన్‌ చేసుకోవచ్చు. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే చాట్‌లు లాక్ అయినప్పుడు నోటిఫికేషన్ కంటెంట్, పరిచయాలు..

Whatsapp: ఈ సెట్టింగ్‌ మారిస్తే మీ వాట్సాప్‌ ఓపెన్‌ ఉన్నా మెసేజ్‌లను ఎవ్వరు చదవలేరు!
ఆటోమేటిక్ అనువాదాన్ని ఆన్ చేయండి: ఈ ఫీచర్ మరో ప్రత్యేకత ఏమిటంటే, ఆండ్రాయిడ్ వినియోగదారులు ఇప్పుడు మొత్తం చాట్ కోసం ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్‌ను ప్రారంభించవచ్చు. ఆ చాట్‌లోని అన్ని కొత్త సందేశాలు ఎంచుకున్న భాషలోకి స్వయంచాలకంగా అనువదించుకోవచ్చు.
Subhash Goud
|

Updated on: Aug 31, 2025 | 12:43 PM

Share

Whatsapp: ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది చాలా ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. అయితే కొన్నిసార్లు ప్రజలకు దీని గురించి కొన్ని గోప్యతా సమస్యలు ఉంటాయి. చాలా సార్లు, మీ ఫోన్ స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుని వద్ద ఉంటే, ప్రత్యేకమైన వ్యక్తి నుండి సందేశం వస్తే ఎవరు చూస్తారో..? ఏం జరుగుతుందో ఆందోళన చెందుతుంటారు. మీ ఈ ఆందోళనను తొలగించడానికి ఓ ట్రిక్‌ ఉంది. ఇందులో మీ సందేశాలను ఎవ్వరు కూడా చూడలేరు. మీ సందేశాలు కూడా సురక్షితంగా ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైన, సురక్షితమైన ఫీచర్‌. దీన్ని ఆన్ చేయడానికి మీరు ఈ ట్రిక్స్‌ అనుసరించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Viral Video: ఇవే తగ్గించుకుంటే మంచిది.. కొండముచ్చు ముందు అమ్మాయి రీల్స్‌.. చివరకు ఏమైందంటే..

ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ తెరవండి. ఇప్పుడు మీరు దాచాలనుకుంటున్న చాట్‌ను ఎంచుకోండి. మీ స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కల చిహ్నాన్ని నొక్కండి. ఇక్కడ మీరు “లాక్ చాట్” ఎంపిక కనిపిస్తుంటుంది. దానిపై నొక్కండి. మీ స్క్రీన్‌పై “ఈ చాట్‌ను లాక్ చేసి దాచి ఉంచండి” అనే పాప్-అప్ కనిపిస్తుంది. దానిని ఎంపిక చేసుకోండి. ఎంచుకున్న చాట్‌ను లాక్ చేయడానికి “కొనసాగించు” అనే ఆప్షన్‌పై నొక్కండి.

ఇవి కూడా చదవండి

ఈ విధంగా మీరు ఆ వాట్సాప్ చాట్‌లను లాక్ చేయవచ్చు. దీన్ని మీ ఫోన్ బయోమెట్రిక్స్ – ఫేస్‌, వేలిముద్ర ద్వారా మాత్రమే ఓపెన్‌ చేసుకోవచ్చు. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే చాట్‌లు లాక్ అయినప్పుడు నోటిఫికేషన్ కంటెంట్, పరిచయాలు దాచి ఉంటాయని గుర్తించుకోండి. వాట్సాప్‌ లాక్ చేయబడిన చాట్‌కు సంబంధించిన 1 కొత్త సందేశం నోటిఫికేషన్‌లో కనిపిస్తుంది. చాట్‌ను అన్‌లాక్ చేయడానికి: మీరు ఈ చాట్‌లను అన్‌లాక్ చేయాలనుకుంటే, మీరు ఆ వ్యక్తి చాట్‌కి వెళ్లి, అక్కడి నుండి ప్రొఫైల్‌కి వెళ్లండి. ఇక్కడ మీకు లాక్ చేయబడిన చాట్‌ను అన్‌లాక్ చేసే ఎంపిక ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా