Smart Phone Price Hike: స్మార్ట్ ఫోన్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. వచ్చే ఏడాది భారీగా ధరల పెంపు?

|

Nov 15, 2024 | 4:00 PM

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది యువత జీవితంలో ఓ భాగంగా మారింది. ముఖ్యంగా ప్రతి చిన్న అవసరానికి స్మార్ట్ ఫోన్ వినియోగించడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్‌లను ఇష్టపడుతున్నారు. ఇలాంటి వారికి షాక్ ఇస్తూ వచ్చే ఏడాది నుంచి స్మార్ట్ ఫోన్ ధరలు పెరగనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి స్మార్ట్ ఫోన్ ధరలు ఏ స్థాయిలో పెరుగుతాయో? ఓసారి తెలుసుకుందాం.

Smart Phone Price Hike: స్మార్ట్ ఫోన్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. వచ్చే ఏడాది భారీగా ధరల పెంపు?
Follow us on

మొబైల్ ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం అన్ని రంగాల్లో స్వల్ప ద్రవ్యోల్బణం కూడా సామాన్యుల బడ్జెట్‌ను కుదిపేస్తుంది.  వచ్చే ఏడాదిలో మొబైల్ ఫోన్ ధరలు 8 శాతం వరకు పెరగవచ్చు నిపుణులుు అంచనా వేసత్ున్నారు. ఓ రీసెర్చ్ ప్రకారం, స్మార్ట్‌ఫోన్‌ల ధర 2024లో సగటున 3 శాతం, 2025లో 5 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లు గతంలో కంటే ఖరీదైనవిగా మారుతున్నాయి.  అధునాతన భాగాలతో పాటు 5జీ ​​టెక్నాలజీ, జనరేటివ్ ఏఐ వంటి ఆధునిక సేవలను ఫోన్స్‌లో అందించడం వల్ల ధరల పెరుగదల అనేది పరిపాటిగా మారింది. ముఖ్యంగా జనరేటివ్ ఏఐ కారణంగా ధరలు మునుపెన్నడూ లేని విధంగా పెరుగుతన్నాయి. 

ఏఐ ఎనేబుల్డ్ టెక్నాలజీపై కస్టమర్‌లు ఆసక్తి చూపుతున్నందున స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు సీపీయూ, ఎన్‌పీయూ (న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్), జీపీయూని మెరుగుపరచడం ద్వారా కొత్త ప్రాసెసర్‌లను అందిస్తున్నాయి. ఈ అధిక-పనితీరు గల ప్రాసెసర్‌ల ధర ఎక్కువగా ఉంటుంది, దీని కారణంగా స్మార్ట్‌ఫోన్‌లు ఖరీదైనవిగా మారుతున్నాయి. అలాగే స్మార్ట్ ఫోన్స్‌లో వినియోగించే చిప్‌లు కూడా 4ఎన్ఎం, 3 ఎన్ఎం వంటి అధునాతన ప్రక్రియలను ఉపయోగించడం వల్ల ధరలు మరింత పెరుగుతున్నాయి. 

అయితే స్మార్ట్‌ఫోన్ ధరల పెరుగుదలపై సామాన్యులు పెదవి విరుస్తున్నారు. అయితే అధునాతన ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్ కావాలంటే మాత్రం కచ్చితంగా అధిక పెట్టాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అధునాతన కెమెరాతో పాటు ఏఐ ఫీచర్లు యూజర్లకు మంచి ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయని అందువల్ల ధరల పెంపు తప్పదని నిపుణులు చెబుతున్నాయి. అధునాతన ఏఐ ఫీచర్లు ఉంటే అద్భుతమైన కెమెరా పనితీరుతో వర్చువల్ అసిస్టెంట్లు వంటి అనేక కొత్త సేవలను పొందవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి