స్పీకర్ ఒకటే ముక్కలు మూడు! రూ.25 వేలు స్పీకర్ ఎంత తగ్గుతుందో తెలిస్తే తప్పక కొనేస్తారు
ఇంట్లో పాటలు వినేందుకు సాధారణ బ్లూటూత్ స్పీకర్లనే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అయితే ఒకే స్పీకర్‌ను మూడు భాగాలుగా విడదీసి గదిలో వేర్వేరు చోట్ల పెట్టుకునే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది? ఇలాంటి కొత్త విధానంతో Portronics AuraTrio మార్కెట్లోకి వచ్చింది. 90W సౌండ్ అవుట్‌పుట్, వైర్‌లెస్ కనెక్టివిటీ, నీటి చినుకులను తట్టుకునే సామర్థ్యం ఇందులో ఉన్నాయి.

పార్టీ సమయంలో ఒక్కచోటే కాకుండా గదిలో వేర్వేరు ప్రాంతాల నుంచి సంగీతం వినిపించాలనుకునేవారికి కొత్త తరహా స్పీకర్ ఉపయోగపడొచ్చు. AuraTrioలో ప్రధాన స్పీకర్‌కు రెండు చిన్న స్పీకర్లను అయస్కాంతాలతో జత చేయవచ్చు. అవసరమైనప్పుడు వాటిని విడదీసి వేర్వేరుగా పెట్టుకోవచ్చు. ప్రస్తుతం రూ.14,999 ప్రత్యేక ధరకు ఈ మోడల్ లభిస్తోంది.
మూడు భాగాలుగా విడిపోయే స్పీకర్
AuraTrioలో ఒక ప్రధాన స్పీకర్‌తో పాటు రెండు చిన్న శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి. ఇవి ప్రధాన యూనిట్‌కు రెండు వైపులా అయస్కాంత పద్ధతిలో కలుస్తాయి. మూడు కలిసినప్పుడు మొత్తం 90W సౌండ్ అవుట్‌పుట్ వస్తుంది. విడదీస్తే ప్రధాన స్పీకర్ 60W, రెండు శాటిలైట్లు చెరో 15W చొప్పున శబ్దాన్ని అందిస్తాయి. చిన్న పార్టీలు, ఇంట్లో సంగీతం వినే సమయంలో శాటిలైట్ స్పీకర్లను గదిలో వేర్వేరు మూలల్లో పెట్టుకోవచ్చు. బ్లాక్ టెక్స్చర్డ్ ఫ్యాబ్రిక్ ఫినిషింగ్‌తో వచ్చిన ఈ స్పీకర్‌ను సులభంగా తీసుకెళ్లేందుకు హ్యాండిల్ కూడా ఉంది.
6 గంటల బ్యాకప్
మూడు భాగాలు విడిపోయిన తర్వాత కూడా ఒకేసారి పాటలు వినిపించేందుకు Bluetooth 5.4, Auracast టెక్నాలజీని ఉపయోగించారు. ప్రత్యేక యాప్ అవసరం లేకుండానే శాటిలైట్ స్పీకర్లు ప్రధాన యూనిట్‌తో కనెక్ట్ అవుతాయి. అవసరమైతే వీటిని విడిగా కూడా ఉపయోగించుకోవచ్చు.
బ్యాటరీ విషయానికి వస్తే ప్రధాన స్పీకర్‌లో 4,500mAh, ఒక్కో శాటిలైట్‌లో 2,000mAh బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 6 గంటల వరకు ప్లేబ్యాక్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. IPX6 వాటర్ రెసిస్టెన్స్ ఉండటంతో నీటి చినుకులు, వర్షం నుంచి రక్షణ ఉంటుంది. అసలు ధర రూ.24,999 కాగా ప్రస్తుతం రూ.14,999 ప్రత్యేక ధరకు లభిస్తోంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు Amazon, Flipkart, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఏడాది వారంటీ కూడా ఉంది.
