AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధర, ఫీచర్లు, భారీ బ్యాటరీతో Oppo K15s, K15x.. కొనేయాలని టెంప్ట్ చేసేంత ఏముందంటే

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ఫోన్ల జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో Oppo K15 సిరీస్‌లో మరో రెండు మోడళ్లను తీసుకొచ్చింది. Oppo K15s, Oppo K15x పేర్లతో చైనాలో లాంచ్ చేసిన ఈ ఫోన్లు భారీ బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో వచ్చాయి. అయితే రెండింటి మధ్య స్పెసిఫికేషన్లలో కీలకమైన తేడాలు ఉన్నాయి.

ధర, ఫీచర్లు, భారీ బ్యాటరీతో Oppo K15s, K15x.. కొనేయాలని టెంప్ట్ చేసేంత ఏముందంటే
Oppo K15s, K15x.jpg
Nikhil
|

Updated on: Oct 02, 2026 | 7:24 AM

Share

ముఖ్యంగా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి ఈ రెండు మోడళ్లు ఆసక్తికరంగా నిలుస్తాయి. K15sలో ఏకంగా 8,000mAh బ్యాటరీ ఉండగా, K15xలో 6,500mAh బ్యాటరీ ఇచ్చారు. రెండింటికీ 45W SuperVOOC Flash Charging సపోర్ట్ ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్లు చైనా మార్కెట్లో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో విడుదలపై కంపెనీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

AMOLED డిస్‌ప్లే

Oppo K15s 6GB + 128GB వేరియంట్ ధర CNY 1,699 (సుమారు రూ.24,300)గా ఉంది. 8GB + 256GB వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ.28,600). Shadow Grey, Wind Trail Purple రంగుల్లో లభిస్తుంది. 6.57 అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లే, 2,372×1,080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1,400 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ఉన్నాయి. MediaTek Dimensity 6360 MAX చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 50MP ప్రధాన కెమెరా, 8MP ముందు కెమెరా ఇచ్చారు.

హెడ్‌ఫోన్ జాక్ ప్రత్యేకం

Oppo K15x 6GB + 128GB వేరియంట్ CNY 1,399 (సుమారు రూ.20,000) ధరతో, 6GB + 256GB మోడల్ CNY 1,699 (సుమారు రూ.24,300) ధరతో వచ్చింది. 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. MediaTek Dimensity 6300 చిప్‌సెట్, 13MP ప్రధాన కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా అందించారు.

6,500mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. USB Type-Cతో పాటు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఇచ్చారు. సైడ్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు ఫోన్లను చైనాలో మాత్రమే ప్రకటించారు. భారత మార్కెట్లో వీటి విడుదలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

Follow Us