కొత్త స్కూటర్లతో మార్కెట్‌ను రూల్ చేయడానికి Vespa రెడీ.. సూపర్ రేంజ్‌తో మూడు స్కూటర్లు.. వివరాలివే
ప్రముఖ టూ వీలర్ బ్రాండ్ Vespa తన ప్రత్యేకమైన రెట్రో డిజైన్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు పెట్రోల్ స్కూటర్లతో ఆకట్టుకున్న ఈ సంస్థ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోనూ తన పరిధిని విస్తరిస్తోంది. పాతకాలపు రూపాన్ని కొనసాగిస్తూనే ఆధునిక టెక్నాలజీని జోడించి కొత్త మోడళ్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలో మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రపంచ మార్కెట్‌కు పరిచయం చేసింది.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, గరిష్ట వేగంతో పాటు డిజైన్, సౌకర్యవంతమైన ప్రయాణం కూడా ముఖ్యమే. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని Vespa Sprint S, Primavera, Primavera Tech మోడళ్లను అభివృద్ధి చేసింది. వీటిలో వేర్వేరు బ్యాటరీ సామర్థ్యాలు, మోటార్ పవర్, ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా Primavera Tech మోడల్ మిగిలిన రెండింటి కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుంది.
క్లాసిక్ డిజైన్‌తో..
ఈ మూడు మోడళ్లలోనూ Vespa తన ఐకానిక్ డిజైన్‌ను కొనసాగించింది. మోనోకోక్ ఛాసిస్, ట్రైలింగ్ లింక్ ఫ్రంట్ సస్పెన్షన్, ఆల్ LED లైటింగ్‌ను అందించారు. 12/11 ఇంచ్ వీల్ సెటప్ కూడా ఉంది. పెట్రోల్ వెస్పా స్కూటర్లతో పోలిస్తే ఎగ్జాస్ట్ లేకపోవడం ప్రధానమైన మార్పు.
Sprint S, Primavera మోడళ్లలో 2.3kWh తొలగించగల బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. వీటిలో 3.1kW మోటార్ ఉంటుంది. ఇది 2.7kW నిరంతర శక్తి, 200Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు స్కూటర్ల గరిష్ఠ వేగం గంటకు 45 కిలోమీటర్లు. WMTC ప్రమాణాల ప్రకారం ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 68 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 500W ఛార్జర్‌తో బ్యాటరీని 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు నాలుగు గంటలు పడుతుంది. బ్యాటరీతో కలిపి వీటి బరువు 111 కిలోలు.
80 కి.మీ. రేంజ్..
ఈ లైనప్‌లో టాప్ మోడల్ అయిన Primavera Techలో 4.2kWh సామర్థ్యం కలిగిన పెద్ద బ్యాటరీని అందించారు. దీని ఎలక్ట్రిక్ మోటార్ 3.6kW నిరంతర శక్తిని అందిస్తుంది. WMTC ప్రమాణాల ప్రకారం ఒక్కసారి ఛార్జింగ్‌తో 80 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ స్కూటర్ బరువు 130 కిలోలు.
ఫీచర్ల విషయానికి వస్తే 4.3 ఇంచ్ TFT డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, Turn-by-Turn Navigation, Keyless Ignition, Find My Scooter సదుపాయాలు ఉన్నాయి. Eco, Power అనే రెండు రైడింగ్ మోడ్‌లను అందించారు. మూడు మోడళ్లలోనూ ముందు 200mm డిస్క్, వెనుక 140mm డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. Primavera Techలో అదనంగా Single-Channel ABS ఇచ్చారు.
ప్రస్తుతం ఈ స్కూటర్లను భారత్‌లో విడుదల చేసే విషయంపై Vespa ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ దేశీయ మార్కెట్లోకి వస్తే Bajaj Chetakతో పాటు TVS, Ather, Hero, Honda, Suzuki, River వంటి సంస్థల ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది. అయితే భారత విడుదల, ధర వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.
