Medicine for Cancer: హిమాలయాలలో ఎక్కువగా కనిపించే ఫంగస్‌తో క్యాన్సర్‌కు చికిత్స చేయవచ్చు. ఈ ఫంగస్‌ను శాస్త్రీయంగా కార్డిసెప్స్ సైనెన్సిస్ అంటారు. ఇది క్యాన్సర్‌తో పోరాడే.. క్యాన్సర్ కణాలను ఆపగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ..బయోఫార్మా కంపెనీ న్యూకానా సంయుక్త పరిశోధనలో కూడా ఇది రుజువైంది. అసలు ఈ ఫంగస్ అంటే ఏమిటి, క్యాన్సర్ చికిత్సలో ఇది ఎలా సహాయపడుతుంది.. ఎందుకు ప్రత్యేకమైనది తెలుసుకుందాం.
ఈ ఫంగస్ ఏమిటి?
ఇది హిమాలయాలలో కనిపించే ఫంగస్. ఇది చైనీస్ ఔషధ తయారీలో వందల సంవత్సరాలుగా ఉపయోగంలో ఉంది. దీనిని గొంగళి పురుగు ఫంగస్ అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా హిమాలయాల్లోని నేపాల్, భూటాన్ భాగంలో కనిపిస్తుంది. కార్డిప్సిన్, అడెనోసిన్ రసాయనాలు ఇందులో కనిపిస్తాయి. కోడిసెప్సిన్ ఈ ఫంగస్ అతి పెద్ద లక్షణం. ఈ ఫంగస్‌కు చైనీస్ మెడిసిన్‌లో ఔషధ పుట్టగొడుగు హోదా ఇవ్వడానికి కారణం ఇదే.
ఇప్పుడు తెలుసుకోండి, ఇది క్యాన్సర్‌ను ఎలా నయం చేస్తుంది?
ఈ ఫంగస్ నుండి, శాస్త్రవేత్తలు కెమోథెరపీ ఔషధంగా ఉపయోగించే ఔషధాన్ని అభివృద్ధి చేశారు. ఈ ఔషధానికి NUC-7738 అని పేరు పెట్టారు. ఇది క్యాన్సర్ నిరోధక ఔషధం అని పరిశోధన సమయంలో కనుగొన్నారు. అంటే, ఇది క్యాన్సర్‌ను ఓడించే సామర్ధ్యం కలిగి ఉంది. ఇది క్యాన్సర్ కణాలను నిరోధించడంలో సహాయపడుతుంది. 40 శాతం వరకు ప్రభావవంతంగా ఉంటుంది.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఫంగస్‌లో కనిపించే కార్డిప్సిన్ అనే రసాయనం శరీరానికి చేరి రక్తంలో కరగడం ప్రారంభమవుతుంది. ఇది ADA అనే ఎంజైమ్ సహాయంతో విచ్ఛిన్నమవుతుంది. దీని తరువాత, ఇది క్యాన్సర్ కణాలను చేరుకోవడం ద్వారా దాని ప్రభావాన్ని చూపుతుంది. ప్రారంభ క్లినికల్ ట్రయల్స్‌లో కూడా ఇది రుజువైంది.
క్లినికల్ క్యాన్సర్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురించబడిన మొదటి దశ ట్రయల్ విజయవంతమైన అధ్యయనం ప్రకారం, ఫార్మా కంపెనీ న్యూకానా ఈ ఔషధాన్ని NUC-7738 పేరుతో ఉపయోగిస్తోంది. క్లినికల్ ట్రయల్ ఫేజ్ -1 ఫలితాలు ప్రభావవంతంగా ఉన్నాయి. క్లినికల్ ట్రయల్ యొక్క ఫేజ్ -2 కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో తదుపరి దశ ట్రయల్స్ పెద్ద ఎత్తున జరుగుతుంది.
దేశంలో 14 లక్షల మంది క్యాన్సర్ రోగులు: ఐసీఎంఆర్
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం, దేశంలో 13.9 లక్షల మంది క్యాన్సర్ రోగులు ఉన్నారు. 2025 నాటికి, వారి సంఖ్య 15.7 లక్షలకు పెరుగుతుంది.
2020 లో 6,79,421 మంది భారతీయ పురుషులలో క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య 2025 నాటికి 7,63,575 కి చేరుకోవచ్చు. అదే సమయంలో, 2020 లో, 7,12,758 మంది మహిళలు క్యాన్సర్ బారిన పడ్డారు. 2025 నాటికి, ఈ కేసులు 8,06,218 కి చేరవచ్చు. ఐసీఎంఆర్(ICMR) నివేదిక ప్రకారం, 2025 నాటికి, రొమ్ము క్యాన్సర్ ఈ వ్యాధికి అత్యంత సాధారణ క్యాన్సర్‌గా మారుతుంది. రెండవ స్థానంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
6G Technology: ఇంకా 5G టెక్నాలజీని రానేలేదు.. 6G టెక్నాలజీపై కసరత్తు ప్రారంభించిన కేంద్ర సర్కార్..!