Instagram Feature: యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌.. ఇకపై వాయిస్‌ రూపంలో..

Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ యాప్‌కు అట్రాక్ట్‌ అవుతున్నారు. ఎప్పటికప్పుడు...

Instagram Feature: యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌.. ఇకపై వాయిస్‌ రూపంలో..
Instagram Features

Updated on: Mar 29, 2022 | 5:05 PM

Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ యాప్‌కు అట్రాక్ట్‌ అవుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే ఈ యాప్‌కు ఇంత ఆదరణ దక్కిందని చెప్పాలి. ఇలా నిత్యం ఏదో ఒక కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చే ఇన్‌స్టాగ్రామ్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. సాధారణంగా ఇన్‌స్టా స్టోరీలకు టెక్ట్స్‌ రూపంలో మాత్రమే రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఇన్‌స్టాగ్రామ్‌ తాజాగా తీసుకురానున్న ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో ఇన్‌స్టా స్టోరీలకు వాయిస్‌ మెసేజ్‌, ఫోటోతో రిప్లై ఇవ్వొచ్చు.

ప్రస్తుతం ఈ ఫీచర్లు టెస్టింగ్‌ దశలో ఉన్నాయి. విజయవంతంగా టెస్టింగ్‌ పూర్తి కాగానే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫీచర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ల సంఖ్య మరింత పెరగనుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఫీచర్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ క్యూఆర్‌ కోడ్‌ సాయంతో పోస్ట్‌లు షేర్‌ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించనుంది. ఇందులో భాగంగానే మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వీటితో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలకు రిప్లై ఇస్తే గతంలో మెసేజ్‌ ఇన్‌బాక్స్‌లో చూపించేవి. కానీ తాజాగా తీసుకొస్తున్న వాయిస్‌ మెసేజ్‌, ఫొటో రిప్లై ఫీచర్‌తో ప్రైవేట్ స్టోరీ లైక్‌ ఫీచర్‌ ఇకపై ఉండదని తెలుస్తోంది.

Also Read: Haryana: చపాతీ ఎక్కువ తిన్నదని అత్తగారిని కొట్టిన కోడలు.. పోలీసుల అదుపులో కోడలు, ఆమె ఫ్యామిలీ

సినిమా టికెట్లపై మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఇకపై ఆన్‏లైన్‏లోనే..

RRR: ఆర్ఆర్ఆర్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే సీతక్క.. అలా అనుకుంటేనే సినిమా చూడాలంటూ..

Loading...
Unable to load recommendations.
Follow Us