Indian Railways: ఇది మీకు తెలుసా..? రైలు కోచ్‌ల కింద ఉండే ఈ ఇండికేటర్ల సీక్రెట్‌ ఇదే..!

Indian Railways: రైలు కోచ్‌లపై మీరు గమనించని చిన్న ఇండికేటర్లు బ్రేక్ సిలిండర్ ప్రెషర్ ఇండికేటర్లు. వీటి అర్థం ఏంటో తెలుసా..? ఇందులో ఎంతో టెక్నిక్‌ దాగి వుంది. దీని ద్వారా రైలు ఆగిందా లేదా బయలుదేరడానికి సిద్ధంగా ఉందా అని ప్రయాణికులు సులభంగా తెలుసుకోవచ్చు.

Indian Railways: ఇది మీకు తెలుసా..? రైలు కోచ్‌ల కింద ఉండే ఈ ఇండికేటర్ల సీక్రెట్‌ ఇదే..!
Indian Railways

Updated on: Mar 09, 2026 | 6:57 AM

Indian Railways: చాలా మంది రైళ్లలో ప్రయాణించే ఉంటారు. కానీ రైల్వే స్టేషన్‌కు వెళ్లిన తర్వాత కొన్ని విషయాలని గమనించినట్లయితే ఆసక్తికరంగా ఉంటాయి. వీటిలో ఇంత అర్థం ఉందా? అని అనిపిస్తుంది. చాలామందికి తెలియని రైలు రహస్యాలలో ఒకటి రైలు కోచ్‌ల పక్కన కనిపించే చిన్న ఇండికేటర్లు. వీటిని బ్రేక్ సిలిండర్ ప్రెషర్ ఇండికేటర్లు అంటారు. ఈ ఇండికేటర్లు రైలు బ్రేకింగ్ వ్యవస్థ స్థితిని సూచిస్తాయి. తద్వారా ప్రయాణికులు, రైల్వే సిబ్బందికి ముఖ్యమైన సమాచారం అందుతుంది.

ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న LHB (Linke Hofmann Busch) కోచ్‌లలో ఎయిర్ బ్రేక్ సిస్టం వాడుతున్నారు. ఈ వ్యవస్థ లోకో పైలట్ బ్రేకులు వేసినప్పుడు లేదా రిలీజ్ చేసినప్పుడు ఇండికేటర్ల రంగును మారుస్తుంది. లోకో పైలట్ బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ సిలిండర్లలో ఒత్తిడి పెరిగి, ఇండికేటర్ ఎరుపు రంగులోకి మారుతుంది. ఇది రైలు బ్రేకులు వేసి ఆగి ఉందని సూచిస్తుంది. లోకో పైలట్ బ్రేకులను రిలీజ్ చేసిన వెంటనే సిలిండర్లలో ఒత్తిడి తగ్గి, ఇండికేటర్ ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఇది రైలు బ్రేకులు లేవని, బయలుదేరడానికి సిద్ధంగా ఉందని లేదా కదులుతోందని సూచిస్తుంది.

మీరు రైల్వే స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఈ ఇండికేటర్లను గమనించడం ద్వారా రైలు బ్రేక్ వేసి ఉందా లేదా బయలుదేరడానికి సిద్ధంగా ఉందా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. ఈ చిన్న సూచనలు రైల్వే భద్రత, సమయపాలనలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us