AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arattai App: వాట్సాప్‌కు పోటీగా ఇండియన్ యాప్! వాట్సాప్‌కు మించిన ఫీచర్లు!

వాట్సాప్ కు పోటీగా ఇండియా నుంచి ఓ కొత్త మెసేజింగ్ యాప్ రాబోతోంది. ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ జోహో కార్పొరేషన్ ఈ కొత్త యాప్ ను రూపొందించింది. మరి ఈ యాప్ నిజంగా వాట్సాప్ కు పోటీ ఇవ్వగలదా? ఈ యాప్ లోని ప్రత్యేకతలేంటి? ఇప్పుడు చూద్దాం.

Arattai App: వాట్సాప్‌కు పోటీగా ఇండియన్ యాప్! వాట్సాప్‌కు మించిన ఫీచర్లు!
Arattai App
Nikhil
|

Updated on: Sep 29, 2025 | 11:05 AM

Share

వాట్సాప్ కు ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల యూజర్లు ఉన్నారు. అయితే ఇప్పుడు దీనికి పోటీగా మనదేశం నుంచి ఓ కొత్త యాప్ రిలీజైంది. అదే అరట్టై. చెన్నైకి చెందిన జోహో కార్పొరేషన్‌ ఈ యాప్ ను రూపొందించింది. ప్రస్తుతం ఈ యాప్‌ ప్రస్తుతం యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ విభాగంలో నంబర్‌-1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ కూడా ఈ యాప్‌ను ప్రోత్సహించాలంటూ  పిలుపునిచ్చారు. దీంతో ఈ యాప్ తెగ వైరల్ అవుతుంది.

స్వదేశీ టెక్నాలజీ

టెక్నాలజీ రంగంలో స్వయం సమృద్ధిని సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా ‘జోహో’ సంస్థ ఈ అరట్టై యాప్‌ను డెవలప్ చేసింది. ఇందుల యూజర్స్ ప్రైవసీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. యూజర్ల డేటా అంతా పూర్తిగా భారతదేశంలోనే సురక్షితంగా ఉంటుందని కంపెనీ చెప్తోంది.  ప్రస్తుతానికి అరట్టై యాప్‌లో కాల్స్‌కు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉంది. మెసేజులకు  కూడా త్వరలో ఎన్ క్రిప్షన్ సదుపాయాన్ని తీసుకొస్తామని చెప్తు్న్నారు.

ఫీచర్స్ ఇవే..

అరట్టై అంటే తమిళ్ లో మాట్లాడుకోవడం అని అర్థం. ఇందులో వాట్సాప్ లాగానే  టెక్స్ట్‌ మెసేజులు, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, వాయిస్‌ కాల్స్, వీడియో కాల్స్‌.. ఇలా అన్ని ఫీచర్స్ ఉన్నాయి. స్పష్టమైన క్వాలిటీతో వాయిస్ కాల్స్,  వీడియో కాల్స్ చేసుకోవచ్చు. వార్తలు, ఇతర సమాచారం కోసం ఛానెల్స్ సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.  ఇండియాలోని అన్ని లోకల్  లాంగ్వేజెస్ లో ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్ ఇంటర్ ఫేస్ కూడా అచ్చం వాట్సాప్ ను పోలి ఉంటుంది. త్వరలోనే ఈ యాప్ లో మరిన్ని అప్ డేట్స్ వస్తాయని, తక్కువ కాలంలోనే దీన్ని వాట్సా్ప్ కు  ప్రత్యామ్యాయంగా మారుస్తామని జోహో సంస్థ చెప్తోంది.

మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..