AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payments: తప్పుగా వేరేవారికి డబ్బులు పంపారా..? నో టెన్షన్.. వెంటనే ఇలా చేస్తే మీ అకౌంట్లోకి రివర్స్..

యూపీఐ యాప్స్‌లో మీరు ఎవరికైనా తప్పుగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారా..? తిరిగి ఎలా పొందాలో తెలియడం లేదా..? డబ్బు పంపిన వ్యక్తికి ఫోన్ చేసి అడిగినా తిరిగి వేయడం లేదా..? ఇలాంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

UPI Payments: తప్పుగా వేరేవారికి డబ్బులు పంపారా..? నో టెన్షన్.. వెంటనే ఇలా చేస్తే మీ అకౌంట్లోకి రివర్స్..
Upi Tranactions
Venkatrao Lella
|

Updated on: Jan 29, 2026 | 6:34 PM

Share

యూపీఐ లావాదేవీలు దేశంలో రికార్డ్ స్థాయిలో పెరిగిపోతున్నాయి. చిన్న షాపుల నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతీచోట యూపీఐ స్కానర్లు దర్శనమిస్తున్నాయి. దీంతో కస్టమర్లు కూడా డిజిటల్ పేమెంట్స్‌కు తెగ అలవాటుపడిపోయారు. జేబులో క్యాష్ ఎవరూ మెయింటైన్ చేయడం లేదు. దీంతో వీధి వ్యాపారి కూడా స్కానర్ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. యూపీఐ పేమెంట్స్ స్వీకరించకపోతే కస్టమర్లు తగ్గి వ్యాపారం దెబ్బతినే అవకాశముంటుంది. ఇక ఎవరికైనా డబ్బులు పంపించాలన్నా యూపీఐ ద్వారా సులువుగా పంపించుకునే సౌకర్యం ఉండటంతో యూపీఐ యాప్స్ ఎక్కువ మంది వాడుతున్నారు. ఇలాంటి సమయంలో ఒకరికి పంపబోయి మరొకరికి పొరపాటుగా మనీ సెండ్ చేసే అవకాశముంటుంది. ఇలాంటి సమయంలో తిరిగి ఎలా పొందాలో చూద్దాం.

వెంటనే ఫిర్యాదు చేయండి

మీరు తప్పుగా ఎవరికైనా డబ్బులు పంపినట్లయితే వెంటనే సదరు యూపీఐ యాప్‌లో ఫిర్యాదు చేయండి. యూపీఐ యాప్‌లో మీ లావాదేవీ సెలక్ట్ చేసుకుంటే అక్కడ వివాదం లేదా తప్పు బదిలీ ఆఫ్షన్ ఉంటుంది. మీరు దానిపై క్లిక్ చేసి ఫిర్యాదు చేయాలి. వెంటనే మీ బ్యాంక్ మీరు ఎవరికైతే డబ్బులు పంపించారో ఆ కస్టమర్ బ్యాంకును సంప్రదిస్తుంది. డబ్బు పొరపాటుగా మీ అకౌంట్లో జమ అయిందని రిసీవర్‌కు చెబుతారు. తిరిగి ఇవ్వాలని వారిని కోరుతారు. ఒకవేళ గ్రహీత అందిస్తే కొద్ది రోజుల్లో మీ అకౌంట్‌కు ఆ డబ్బులు తిరిగొస్తాయి. అదే రిసీవర్ స్పందించకపోయినా లేదా తిరిగి ఇచ్చేందుకు నిరాకరించినా బ్యాంక్ ఏం చేయలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయమని బ్యాంకు మీకు సూచిస్తుంది.

డబ్బులు ఎప్పుడు తిరిగొస్తాయి..?

మీ పేమెంట్ ఫెయిల్ అయిననప్పుడు లేదా మీరు డబ్బులు పంపిన యూపీఐ ఐడీ ఉనికిలో లేనప్పుడు మీకు డబ్బులు తిరిగి వస్తాయి. అందుకే లావాదేవీ సక్సెస్ అయిందా లేదా ఫెయిల్ అయిందా అనేది చూసుకోండి. ఒకవేళ సక్సెస్ అయితే అవతలి వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. మీరు పొరపాటుగా పంపగానే వెంటనే ఫిర్యాదు చేయాలి. దీని వల్ల రిసీవర్‌కు వేగంగా మెస్సేజ్ వెళుతుంది. దీని వల్ల ఉద్దేశపూర్వంగా డబ్బులు వేశారా.. లేదా పోరపాటున జరిగిందా అనేది స్పష్టమవుతుంది.

అకౌంట్‌ను ఫ్రీజ్ చేసే అవకాశం

ఒకవేళ మీరు తప్పుగా డబ్బులు పంపించి ఉంటే బ్యాంకులు రిసీవర్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేసే అవకాశముంటుంది. కానీ ఇలా చేసినా ఖచ్చితంగా వస్తాయనే హామీ అయితే లేదు. నిబంధనల ప్రకారం ఎవరి బ్యాంక్ అకౌంట్లో అయినా డబ్బులు జమ అయితే అవి అతడికే చెల్లుతాయి. ఈ రూల్ వల్ల తప్పుగా డబ్బులు బదిలీ అయితే తిరిగి పొందటం కష్టతరంగా మారిది.

తల్లి అంజనమ్మ పుట్టిన రోజు సందర్భంగా పవన్ ఏం చేశారో తెలుసా?
తల్లి అంజనమ్మ పుట్టిన రోజు సందర్భంగా పవన్ ఏం చేశారో తెలుసా?
గంభీర్, గిల్‌లకు ఇచ్చిపడేసిన టీమిండియా మాజీ ప్లేయర్
గంభీర్, గిల్‌లకు ఇచ్చిపడేసిన టీమిండియా మాజీ ప్లేయర్
గ్రహాల అనుకూలత.. ఇక ఆ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది..!
గ్రహాల అనుకూలత.. ఇక ఆ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది..!
అర్థరాత్రి కానిస్టేబుల్ భార్యకు ఆ ఫొటోలతో మెసేజ్.. కట్ చేస్తే..
అర్థరాత్రి కానిస్టేబుల్ భార్యకు ఆ ఫొటోలతో మెసేజ్.. కట్ చేస్తే..
50 ఏళ్ల తర్వాత కెమెరాకు చిక్కిన అరుదైన బ్లాక్ టైగర్.. ఎక్కడంటే..?
50 ఏళ్ల తర్వాత కెమెరాకు చిక్కిన అరుదైన బ్లాక్ టైగర్.. ఎక్కడంటే..?
చుక్కలన్నంటిన బంగారం, వెండి.. ఇక నెక్ట్స్ బంగారం అయ్యే మెటల్ ఇదే!
చుక్కలన్నంటిన బంగారం, వెండి.. ఇక నెక్ట్స్ బంగారం అయ్యే మెటల్ ఇదే!
యూపీఐలో పొరపాటున వేరేవారికి డబ్బులు వేశారా..? ఇలా చేస్తే..
యూపీఐలో పొరపాటున వేరేవారికి డబ్బులు వేశారా..? ఇలా చేస్తే..
వామ్మో.. తక్కువకు వస్తుందని బిల్లు లేకుండానే బంగారం కొంటున్నారా?
వామ్మో.. తక్కువకు వస్తుందని బిల్లు లేకుండానే బంగారం కొంటున్నారా?
రాత్రికి రాత్రే స్టార్ అవ్వాలనుకుంటున్నారా..? ఇది చదివితే..
రాత్రికి రాత్రే స్టార్ అవ్వాలనుకుంటున్నారా..? ఇది చదివితే..
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ