AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero కొత్త ఈవీ.. VIDA Project VXZతో మార్కెట్​లోకి దూసుకొస్తున్న బైక్​.. పూర్తి వివరాలివే

ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తన ప్రణాళికలను మరింత విస్తరించేందుకు Hero MotoCorp సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రధానంగా దృష్టి పెట్టిన సంస్థ.. తాజాగా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ విభాగంలోకి అడుగుపెట్టే దిశగా కొత్త మోడల్‌ను ప్రదర్శించింది. EICMA 2026 వేదికగా VIDA Project VXZ పేరుతో స్పోర్టీ ఎలక్ట్రిక్ స్ట్రీట్‌ఫైటర్‌ను ఆవిష్కరించింది. అమెరికాకు చెందిన Zero Motorcycles సహకారంతో అభివృద్ధి చేసిన ఈ బైక్‌ ఆకర్షణీయమైన పింక్‌, పర్పుల్ రంగుల బాడీ వర్క్‌తో ప్రత్యేకంగా కనిపిస్తోంది. దూకుడైన హెడ్‌ల్యాంప్‌, మస్క్యులర్ బాడీ ప్యానెల్స్‌, పైకి లేచిన టెయిల్‌ డిజైన్‌ దీని స్పోర్టీ లుక్‌ను మరింత పెంచుతున్నాయి.

Hero కొత్త ఈవీ.. VIDA Project VXZతో మార్కెట్​లోకి దూసుకొస్తున్న బైక్​.. పూర్తి వివరాలివే
Hero Vida Project Vxz Electric Motorcycle
Nikhil
|

Updated on: Nov 14, 2026 | 8:40 PM

Share

VIDA Project VXZ బైక్‌లోని కొన్ని ప్రత్యేక ఇంజినీరింగ్‌ అంశాలు ఇప్పుడు ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా బెల్ట్‌ డ్రైవ్‌ సిస్టమ్‌, బయటకు కనిపించని ఛార్జింగ్‌ పోర్ట్‌, పెద్ద డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ఇందులో ఉన్నాయి. అంతేకాదు, డిస్‌ప్లేలో కనిపించిన బ్యాటరీ శాతం, రేంజ్‌ వివరాల ఆధారంగా ఈ బైక్‌ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 190 కిలోమీటర్లు ప్రయాణించవచ్చనే అంచనాలు వస్తున్నాయి. అయితే కంపెనీ అధికారికంగా రేంజ్‌, బ్యాటరీ సామర్థ్యం, ధర, మార్కెట్‌ విడుదల తేదీని వెల్లడించలేదు.

ఛార్జింగ్‌ పోర్ట్‌ ప్రత్యేకతలు

సాధారణ పెట్రోల్‌ బైక్‌లలో కనిపించే చైన్‌ డ్రైవ్‌కు బదులుగా VIDA Project VXZలో బెల్ట్‌ డ్రైవ్‌ సిస్టమ్‌ను అందించారు. స్వింగ్‌ఆర్మ్‌ పివట్‌కు సమీపంలో అమర్చిన మోటార్‌ నుంచి వెనుక చక్రానికి ఈ బెల్ట్‌ ద్వారా శక్తి అందుతుంది. బైక్‌ మధ్య భాగంలో ఫిన్స్‌తో కూడిన ప్రత్యేక ఎన్‌క్లోజర్‌ కూడా కనిపిస్తోంది. అయితే మోటార్‌ పవర్‌, టార్క్‌, బ్యాటరీ వివరాలను Hero ఇంకా వెల్లడించలేదు.

ఈ బైక్‌లో ఛార్జింగ్‌ పోర్ట్‌ను కూడా ప్రత్యేకంగా అమర్చారు. సాధారణంగా పెట్రోల్‌ ట్యాంక్‌లా కనిపించే బాడీ ప్యానెల్‌ కింద హింగ్డ్‌ కవర్‌ వెనుక ఛార్జింగ్‌ పోర్ట్‌ను దాచారు. దీంతో బైక్‌ డిజైన్‌ స్పోర్టీగా కనిపించడంతో పాటు ఛార్జింగ్‌ ఇన్‌లెట్‌ బయటకు కనిపించకుండా ఉంటుంది. అయితే ఛార్జింగ్‌ వేగం, కనెక్టర్‌ రకం, ఆన్‌బోర్డ్‌ ఛార్జర్‌ సామర్థ్యం గురించి వివరాలు తెలియాల్సి ఉంది.

డిజిటల్‌ ఫీచర్లు

VIDA Project VXZలో పెద్ద కలర్‌ డిజిటల్‌ డిస్‌ప్లేను అందించారు. ఇందులో బైక్‌ గ్రాఫిక్‌, బ్యాటరీ సమాచారం, అంచనా రేంజ్‌, పార్కింగ్‌ ఫంక్షన్లతో పాటు ABS, ట్రాక్షన్‌ కంట్రోల్‌ సూచికలు కనిపిస్తున్నాయి. హ్యాండిల్‌బార్‌పై ప్రత్యేక రైడింగ్‌ మోడ్‌ సెలెక్టర్‌ కూడా ఉంది. Sport Mode, Traction Control, SOS బటన్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం కనిపిస్తున్నప్పటికీ, ప్రొడక్షన్‌ మోడల్‌లో ఇవన్నీ ఉంటాయా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

రేంజ్‌ విషయానికి వస్తే.. బైక్‌ డిస్‌ప్లేలో 80 శాతం బ్యాటరీతో 150 కిలోమీటర్ల అంచనా రేంజ్‌ కనిపించింది. దీని ఆధారంగా 100 శాతం ఛార్జ్‌పై సుమారు 188 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఇది అధికారిక రేంజ్‌ ప్రకటన కాదు. ఈ బైక్‌లో USD ఫ్రంట్‌ ఫోర్కులు, వెనుక మోనోషాక్‌, డిస్క్‌ బ్రేకులు కూడా ఉన్నాయి. Project VXZను Hero తొలిసారిగా EICMA 2025లో ప్రదర్శించగా, ఇప్పుడు EICMA 2026లో మరిన్ని వివరాలతో చూపించింది. భారత మార్కెట్‌లో విడుదల తేదీ, ధర, ఉత్పత్తి వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

Follow Us