AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఎక్కువ రోజులు రావాలా? అద్భుతమైన ట్రిక్‌!

Gas Cylinder: సాధారణంగా కొన్ని సిలిండర్‌లో అప్పుడప్పుడు సిన్నగా గ్యాస్‌ లీక్‌ అవుతుంటుంది. గ్యాస్‌ రెగ్యులేటర్‌, పైపు, బర్నర్‌ను చెక్‌ చేసుకోవాలి. మీ స్టవ్‌లో గ్యాస్ లైన్ దెబ్బ‌తిని వుంటే వంట చేయనప్పుడు కూడా గ్యాస్ వృధా అవుతుంది. దీని వల్ల..

Gas Cylinder: మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఎక్కువ రోజులు రావాలా? అద్భుతమైన ట్రిక్‌!
Subhash Goud
|

Updated on: Aug 06, 2025 | 1:49 PM

Share

గ్యాస్‌ సిలిండర్‌ అనేది ఈరోజుల్లో ప్రతి ఒక్కరు వాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి వంట గ్యాస్‌ సిలిండర్‌ ఉండాలని, కట్టెల పొయ్యిపై వండకూడదనే ఉద్దేశంతో ఉజ్వల స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం దేశంలో అందరి ఇళ్లలో గ్యాస్‌ సిలిండర్‌లే ఉన్నాయి. అయితే గ్యాస్‌ సిలిండర్‌ను ఇష్టానుసారంగా వాడితే గ్యాస్‌ త్వరగా అయిపోయే అవకాశం ఉంది. కొన్ని ట్రిక్స్‌ పాటిస్తే గ్యాస్‌ను ఎక్కువ రోజులు వచ్చేలా చేసుకోవచ్చు. అదేలాగో చూద్దాం.

  1. బర్నర్‌: చాలా మంది వంట చేసేటప్పుడు బర్నర్‌ను మొత్తం పైకి తిప్పే అలవాటు ఉంటుంది. దీని వల్ల మీ ఎల్పీజీ గ్యాస్ త్వ‌ర‌గా అయిపోయే అవ‌కాశం ఉంటుంది. అందుకే మీరు ఏదైనా వేడి చేయాల‌నుకున్నా, వంట చేయాల‌నుకున్నా పాత్ర కింది భాగంలో మంట ఉండేలా బ‌ర్న‌ర్ ను తిప్పుకుంటే స‌రిపోతుంది. దీని వ‌ల్ల ఎల్పీజీ సిలిండ‌ర్ ఎక్కువ రోజులు రావడంతో పాటు మీ వంట‌గ‌దిలో మ‌రింత వేడి లేకుండా ఉంటుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.
  2. స్టవ్‌ బర్నర్‌ శుభ్రం ఉంచుకోవడం: అలాగే మీ స్టవ్ బర్నర్‌ను శుభ్రంగా ఉంచుకోవ‌డం కూడా ముఖ్యమే. ఎప్పటికప్పుడు బర్నర్‌ను శుభ్రం ఉంచుకోవడం వల్ల కూడా గ్యాస్‌ ఎక్కువ రోజులు వచ్చే అవకాశం ఉంది. ఇందు కోసం మీ గ్యాస్‌ మంట రంగును గమనిస్తే తెలిసిపోతుంది. గ్యాస్‌ మంట నీలం రంగు వచ్చినట్లయితే మీ బ‌ర్న‌ర్ స‌రిగ్గా ఉంద‌ని అర్థం. అలా కాకుండా ఎరుపు/పసుపు/నారింజ రంగు మంట వ‌స్తే మీ బ‌ర్న‌ర్ శుభ్రంగా లేద‌ని అర్థం చేసుకోవాలి. అంటే గ్యాస్ పూర్తిగా ఉపయోగించడం వల్ల మంట అలా నీలం రంగు కాకుండా వ‌స్తుంది. గోరువెచ్చని నీరు, స్క్రబ్ బ్రష్ ఉపయోగించి బర్నర్‌ను శుభ్రం చేసుకోవాలి. అయినా కూడా అలాగే ఉంటే రిపేరు చేయించడం మంచిది.
  3. ఎక్కువ నీరు: చాలా మంది వంట చేసేటప్పుడు నీరు లేదా పదార్థాల పరిమాణాన్ని కొలవరు. నీరు ఎక్కువ‌గా ఉంటే అది ఆవిరి అయ్యే వ‌ర‌కు వంట‌గ్యాస్ వినియోగించాల్సి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే గ్యాస్‌ ఎక్కువ రోజుల వ‌చ్చేలా చేసుకోవచ్చు.
  4. పాత్రలు తడిగా ఉంచడం: వంట చేసే ముందు వంట పాత్రలు బర్నర్‌పై ఉంచేటప్పుడు ఆ పాత్రలు పొడిగా ఉండాలి. తడిగా ఉంటే ఆవిరి కావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. దీని వల్ల కొంత గ్యాస్‌ వెస్ట్‌ అవుతుంది. చిన్ననీటి బిందువులను కలిగి ఉన్న పాత్రలు నీటిని ఆవిరి చేయడానికి ఎక్కువ గ్యాస్ వినియోగించాల్సి వ‌స్తుంది. పాన్ వేడెక్కిన తర్వాత మీరు మంటను తగ్గించి కూడా గ్యాస్‌ను ఆదా చేసుకోవచ్చు. అధిక మంట పెట్టడం వల్ల కూడా గ్యాస్‌ ఎక్కువా తీసుకుంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. ప్రెషర్ కుక్కర్‌: ప్రెషర్ కుక్కర్‌ని ఉపయోగించండం వ‌ల్ల కూడా గ్యాస్ ను ఆదా చేయ‌వ‌చ్చు. ఓపెన్-పాస్‌ల వంటతో పోలిస్తే ఒత్తిడితో కూడిన ఆవిరి ఆహారాన్ని వేగంగా వండుతుంది. దీని వల్ల కూడా గ్యాస్‌ ఆదా అవుతుంది.
  7. గ్యాస్‌ లీక్‌: సాధారణంగా కొన్ని సిలిండర్‌లో అప్పుడప్పుడు సిన్నగా గ్యాస్‌ లీక్‌ అవుతుంటుంది. గ్యాస్‌ రెగ్యులేటర్‌, పైపు, బర్నర్‌ను చెక్‌ చేసుకోవాలి. మీ స్టవ్‌లో గ్యాస్ లైన్ దెబ్బ‌తిని వుంటే వంట చేయనప్పుడు కూడా గ్యాస్ వృధా అవుతుంది. దీని వల్ల ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది.
  8. నానబెట్టడం: వండడానికి ముందు బియ్యం, పప్పులు నానబెట్టాలి. అలా నానబెట్టి వండితే అన్నీ చాలా త్వరగా ఉడుకుతాయి. దీంతో సిలిండర్‌ను ఆదా అవుతుంది.
  9. ఫ్రిజ్‌లో ఉన్న పదార్థాలు: మనకు ఉన్న పెద్ద అలవాటు ఏంటంటే ప్రతిదాన్ని ఫ్రిజ్‌లో పెడుతుంటాము. ఉదా: పాలు వంట చేసేటప్పుడు ఇలా వంటకు కావాల్సిన వస్తువులు ఫ్రిజ్ లో ఉంటే ముందుగా బయటకు తీయాలి. ఎందుకంటే అది కూలింగ్‌ తగ్గిపోయే వరకు సమయం పడుతుంది. అంటే వేడెక్కడానికి కొంత సమయం తీసుకుంటుంది. ఇది గ్యాస్ అయిపోవడానికి ఓ కారణమే.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !
కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. !
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..
గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని..
చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు
చెక్ బుక్ వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయి..ఆ చెక్‌లు చెల్లవు
తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
తెలంగాణలో జోరు వానలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..
మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకున్న కజియా
మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకున్న కజియా
తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ..విషాదాంతం! ఏం జరిగింది?
తల్లిదండ్రులను హత్య చేసిన నర్సు సురేఖ కథ..విషాదాంతం! ఏం జరిగింది?
LPG గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఆ ఇళ్లల్లో కనెక్షన్లు రద్దు..!
LPG గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఆ ఇళ్లల్లో కనెక్షన్లు రద్దు..!
పాతబస్తీ నుంచి ఎయిర్‌పోర్ట్ దాకా.. హైదరాబాద్ మెట్రో రెండో దశ..
పాతబస్తీ నుంచి ఎయిర్‌పోర్ట్ దాకా.. హైదరాబాద్ మెట్రో రెండో దశ..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్.. వైరల్‌గా మారిన వీడియో..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్.. వైరల్‌గా మారిన వీడియో..
ఒక్క సిరీస్.. 3 ఇన్నింగ్స్‌లు.. జీరో రన్స్..
ఒక్క సిరీస్.. 3 ఇన్నింగ్స్‌లు.. జీరో రన్స్..