AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీఐ మార్కెట్‌లోకి యాపిల్ అడుగు.. ఐఫోన్ యూజర్ల కోసం కొత్త పేమెంట్ సదుపాయం!

భారత్‌లో డిజిటల్ చెల్లింపుల రంగంలో యాపిల్ పే అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచ మార్కెట్లో అందుబాటులోకి వచ్చి దాదాపు పుష్కర కాలం తర్వాత భారత మార్కెట్‌లోకి రానుండటం ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం ఫోన్‌పే, గూగుల్ పే ఆధిపత్యం ఉన్న సమయంలో యాపిల్ ఎలాంటి సేవలతో వస్తుందనే దానిపైనే అందరి దృష్టి ఉంది. ప్రారంభంలో క్రెడిట్ కార్డు చెల్లింపులకే పరిమితం కావచ్చని సమాచారం.

యూపీఐ మార్కెట్‌లోకి యాపిల్ అడుగు.. ఐఫోన్ యూజర్ల కోసం కొత్త పేమెంట్ సదుపాయం!
Apple Pay India.jpg
Nikhil
|

Updated on: Sep 27, 2026 | 9:29 AM

Share

క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నేరుగా బ్యాంక్ ఖాతా నుంచి చెల్లించే యూపీఐ విధానం భారత్‌లో రోజువారీ జీవితంలో భాగమైంది. ఇలాంటి మార్కెట్‌లో యాపిల్ పే ప్రవేశం ఆసక్తికరంగా మారింది. తొలి దశలో POS మెషీన్లపై ట్యాప్ అండ్ పే సేవలు అందించే అవకాశం కనిపిస్తోంది. తర్వాత యూపీఐ సపోర్ట్ వస్తే మాత్రం దేశీయ డిజిటల్ చెల్లింపుల రంగంలో పోటీ మరింత పెరగొచ్చు. ఐఫోన్, యాపిల్ వాచ్ వాడేవారికి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడనుంది.

క్రెడిట్ కార్డులతో ట్యాప్ అండ్ పే

భారత్‌లో యాపిల్ పే ప్రారంభ దశలో క్రెడిట్ కార్డుల ఆధారిత ట్యాప్ అండ్ పే సేవలతో రావచ్చని సమాచారం. POS మెషీన్‌పై కార్డును స్వైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఫోన్ లేదా వాచ్‌తో చెల్లింపు చేసే విధానం ఇది. తొలుత యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే మొదటి దశలో క్యూఆర్ కోడ్ ఆధారిత యూపీఐ సదుపాయం లేకపోతే సాధారణంగా చిన్న మొత్తాల చెల్లింపులు చేసే వారికి పెద్దగా ఉపయోగపడకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఫోన్‌పే, గూగుల్ పే ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ పనిచేస్తుండగా, యాపిల్ పే మాత్రం ఐఫోన్, యాపిల్ వాచ్‌లకే పరిమితం కానుంది.

మారే పరిస్థితులు

కొన్ని నివేదికల ప్రకారం భవిష్యత్తులో యాపిల్ పేకు యూపీఐ సపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలా జరిగితే ఐఫోన్‌లో ప్రత్యేక యాప్ తెరవకుండానే చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది. ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీతో ధృవీకరణ పూర్తయ్యాక చెల్లింపు చేయొచ్చు. లాక్ స్క్రీన్ నుంచే పేమెంట్ చేసే సౌలభ్యం ఐఫోన్ వాడేవారికి ఆకర్షణగా మారొచ్చు.

ప్రస్తుతం ఫోన్‌పే, గూగుల్ పేలు భారత యూపీఐ రంగంలో బలమైన స్థానంలో ఉన్నాయి. తొలి దశలో క్రెడిట్ కార్డు చెల్లింపులకే పరిమితమైతే వాటిపై ప్రభావం తక్కువగా ఉండొచ్చు. భవిష్యత్తులో యూపీఐ సేవలను పూర్తిస్థాయిలో తీసుకొస్తే మాత్రం భారత డిజిటల్ చెల్లింపుల మార్కెట్‌లో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?