Vivo smart phones: వీవో నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్లు.. వీ40 సిరీస్ ప్రత్యేకతలు ఏంటంటే..?

|

Aug 10, 2024 | 6:14 PM

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వీవో నుంచి విడులయ్యే స్మార్ట్ ఫోన్లకు మన దేశంలో ఎంతో డిమాండ్ ఉంది. వీటిని కొనుగోలు చేయడానికి మొబైల్ ప్రియులు ఆసక్తి చూపుతారు. ఆ డిమాండ్‌కు అనుగుణంగా వీవో కంపెనీ అనేక ప్రత్యేకతలతో కొత్త ఫోన్లను ఆవిష్కరిస్తోంది. లేటెస్ట్ గా విడుదలైన వీవో వీ40 ప్రో, వీవో వీ40 ఫోన్లలో వివిధ ప్రత్యేకతలు ఉన్నాయి.  వీ 30 సిరీస్ ను అప్ గ్రేడ్ చేసి వీవో వీ40 ప్రో, వీవో వీ40 ఫోన్లను రూపొందించారు. వీటిలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రధానంగా 50 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాలను ఏర్పాటు చేశారు.

Vivo smart phones: వీవో నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్లు.. వీ40 సిరీస్ ప్రత్యేకతలు ఏంటంటే..?
Vivo V 40
Follow us on

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వీవో నుంచి విడులయ్యే స్మార్ట్ ఫోన్లకు మన దేశంలో ఎంతో డిమాండ్ ఉంది. వీటిని కొనుగోలు చేయడానికి మొబైల్ ప్రియులు ఆసక్తి చూపుతారు. ఆ డిమాండ్‌కు అనుగుణంగా వీవో కంపెనీ అనేక ప్రత్యేకతలతో కొత్త ఫోన్లను ఆవిష్కరిస్తోంది. లేటెస్ట్ గా విడుదలైన వీవో వీ40 ప్రో, వీవో వీ40 ఫోన్లలో వివిధ ప్రత్యేకతలు ఉన్నాయి.  వీ 30 సిరీస్ ను అప్ గ్రేడ్ చేసి వీవో వీ40 ప్రో, వీవో వీ40 ఫోన్లను రూపొందించారు. వీటిలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రధానంగా 50 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వీవో వీ40 ప్రో స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమన్సిటీ 9200 ప్లస్ చిప్ సైట్ పై ఆధారపడి పనిచేస్తుంది. అలాగే వీవో 40 లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్ సెట్ ఏర్పాటు చేశారు. ఈ రెండు ఫోన్లలోని 5500ఎమ్ఏహెచ్ బ్యాటరీలు 80 డబ్ల్యూ పాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇస్తాయి. అలాగే జీస్ బ్రాండ్ కెమెరాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి.

వీవో వీ40 ప్రో స్మార్ట్ ఫోన్ కు సంబంధించి 8 జీబీ + 256 జీబీ వేరియంట్ ధర రూ.49,999, అలాగే 12 జీబీ + 512 జీబీ వెర్షన్ ధర రూ. 55,999 అందుబాటులో ఉన్నాయి. గంగెస్ బ్లూ, టైటానియం గ్రే రంగుల్లో తీర్చిదిద్దారు. ఆగస్టు 13 నుంచి ఈ ఫోన్ విక్రయాలు మొదలు కానున్నాయి. వీవో వీ40 ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చారు. 8 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వెర్షన్ రూ.34,999. అలాగే 8జీబీ + 256 జీబీ వెర్షన్ రూ.రూ. 36,999, చివరిగా 12 జీబీ + 512 జీబీ స్టోరేజ్ వెర్షన్‌ రూ.41,999 ధరలకు అందుబాటులోకి ఉన్నాయి. గంగెస్ బ్లూ, లోటస్ పర్పుల్, టైటానియం గ్రే రంగులలో ఆకట్టుకునే ఈ ఫోన్ల ను ప్రీ బుకింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ల విక్రయాలు ఆగస్టు 19వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. వీవో వీ40 ప్రో, వీవో వీ40 స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్ టచ్ ఓఎస్ 14పై పనిచేస్తాయి. దీనిలో ఏర్పాటు చేసిన 6.78 అంగుళాల హెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లే 120హెచ్ జెడ్ రీప్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ నెస్ కలిగి ఉంది. ముఖ్యంగా వీ40 ప్రో ఫోన్ 4ఎన్ఎమ్ మీడియా టెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ ప్రాసెసర్ పై పనిచేస్తుంది. 12 జీబీ ర్యామ్, 512 జబీ వరకూ స్టోరేజ్ చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు వీ40 పోన్ లో 4ఎన్ఎమ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3పై పనిచేస్తుంది

వీవో వీ40 ప్రోలో ఆరా లైట్ ఫ్లాష్‌ కలిగిన జీస్ బ్రాండ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో ఆటో ఫోకస్, ఓఐఎస్ సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ సోనీ ప్రైమరీ సెన్సార్, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 50 ఎక్స్ డిజిటల్ జూమ్‌, మరో 50 మెగాపిక్సెల్ సోనీ టెలిఫోటో పోర్ట్రెయిట్ సెన్సార్ తదితర వాటిని అమర్చారు. వీ40కి సంబంధించి ఓఐఎస్, ఏఎఫ్ తో కూడిన 50 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా, మరో 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, డ్యూయల్ వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీకి సంబంధించి 5జీ, బ్లూటూత్ 5.3, జీపీఎస్, బీడౌ, గెలీలియో, గ్లోనాస్, వైఫై, యూఎస్ బీ టైప్ సి పోర్ట్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌, దుమ్ము, నీటి నిరోధకత కోసం ఐపీ 68 రేటెడ్ ఈ ఫోన్లు యువతను అమితంగా ఆకర్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..