
ఒకవైపే చూడు. రెండోవైపు చూడాలనుకోకు.. తట్టుకోలేవు.. అని బాలయ్య డైలాగ్‌ను గుర్తు చేస్తోంది మనలను అక్రమించేసిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్. టెక్నో ప్రపంచాన్నే కాదు, సాదాసీదా జిందగీల్ని కూడా కబ్జా చేసి.. మనకు తెలీకుండానే మన నుంచి మనల్ని లాగేసుకుంటున్న కృత్రిమ మేథ.. ఇప్పుడిప్పుడే తన డార్క్ షేడ్స్‌ని పరిచయం చేస్తోంది. ఏఐ.. పూర్తిగా చంద్రముఖిగా మారిపోయేలోగా మనలను, మన లైఫ్‌స్టైల్‌నే కాదు, మన పర్యావరణాన్నీ ఎంతెంత చిత్తు చేస్తోంది అని లెక్కలేసుకుని నోరెళ్లబెడుతున్నారు ఎక్స్‌పర్ట్స్. కృత్రిమ మేథ కారణంగా లాంగ్‌రన్‌లో ముంచుకొచ్చే ప్రమాదాలపై ఇప్పుడిప్పుడే ఒక అంచనా అయితే ఏర్పడింది. ఇదిగో ఒక్క క్షణం ఆగు.. చాట్‌జీపీటీని అడిగి చెబుతా..! అరె గ్రోక్.. ఇది తింటే ఒంట్లో ఎన్ని క్యాలరీలు పెరుగుతాయో చెప్పు..! బుర్రంతా గోక్కుంటావెందుకు.. చేతిలో జెమినీ ఏఐ ఉండగా..! ఇదీ యవ్వారం. ఆబాలగోపాలమూ ఇదే తంతు. కొత్త బంగారు లోకంలో తేలిపోతోంది ప్రపంచమంతా. అడగండి చెబుతా అంటూ అడిగిందే తడవుగా అరక్షణంలో ఆన్సరిచ్చే అద్భుతంగా చెలామణి అవుతోంది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్. ఆరు నుంచి అరవై దాకా అన్ని వయసులకూ ఫ్రీగానే దొరుకుతోంది ఇన్‌ఫర్మేటివ్ సర్వీస్. కేజీ స్టూడెంట్‌కి హోమ్‌వర్ అదే చేస్తుంది.. ప్రోగ్రామ్ డిజైనర్‌కి కోడింగూ అదే రాసిపెడుతోంది.. చివరకు కోర్టులిచ్చే జడ్జిమెంట్లను కూడా అదే చదివి...