Breaking News
  • అమరావతి: ఏపీ జర్నలిస్ట్‌ అక్రిడేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ. 2 వారాల్లో అక్రిడేషన్ల పునరుద్ధరణ చేయాలని ఆదేశం. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలన్న హైకోర్టు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా .
  • రేపు వరద ప్రాంతాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన. ఉ.9కు తార్నాకలోని మణికేశ్వర్‌నగర్‌లో పర్యటించనున్న కిషన్‌రెడ్డి . అనంతరం మెట్టుగూడ, అంకమ్మ బస్తీ, శ్యామలకుంట, ఓల్డ్‌ప్రేమ్‌నగర్‌.. నరేంద్రనగర్‌లోని ముంపు ప్రాంతాలను పరిశీలించనున్న కేంద్రమంత్రి. సా.5గంటలకు జీడిమెట్ల ఫాక్స్‌ సాగర్‌ చెరువు పరిశీలన.
  • అనంతపురం: వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌ కేసు. కర్నాటక లోకాయుక్తలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఫిర్యాదుపై స్పందించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి. వాహనాల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో.. కర్నాటక అధికారులపై ఫిర్యాదు చేసినప్పుడు ఏపీలో ఎందుకు చేయలేదని ప్రశ్న . చట్టం మీ చేతుల్లో ఉందని మమ్మల్ని అక్రమంగా అరెస్ట్‌ చేస్తారా. బీఎస్‌3 కన్నా ముందున్న వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పనిచేయడం లేదు. చట్టం తమ చేతుల్లో ఉందని ఇష్టమొచ్చినట్టు కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా మరోసారి జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధం-తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి.
  • విజయవాడ: దుర్గగుడి అభివృద్ధికి రూ.70 కోట్లు కేటాయించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి వెల్లంపల్లి, దేవాలయాల అభివృద్ధి పట్ల సీఎం జగన్‌ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం-వెల్లంపల్లి.
  • హైదరబాద్: వరదల్లో ఇంటర్మీడియట్‌ సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ, డూప్లికేట్‌ మెమోరాండం ఆఫ్‌ మార్క్స్‌ కోసం వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు-ఇంటర్మీడియట్‌ బోర్డ్‌, సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌.
  • అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణించి వాయుగుండంగా మారే అవకాశం. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం . రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు. -అమరావతి వాతావరణ కేంద్రం.
  • తుళ్లూరు రిటైర్డ్‌ తహశీల్దార్‌ సుధీర్‌బాబు క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేత. రాజధాని అసైన్డ్‌ భూముల కుంభకోణంలో సుధీర్‌బాబుపై సీఐడీ కేసు. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని ఏపీ హైకోర్టులో సుధీర్‌బాబు పిటిషన్‌. సుధీర్‌బాబుతో పాటు విజయవాడకు చెందిన సురేష్‌ అరెస్ట్‌.

‘ వైఎస్.. జడ్జిలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చారు, మరి వాటి సంగతేంటి. !’

Tdp Ayyanna patrudu talk about housing sites distribution to court judges, ‘ వైఎస్.. జడ్జిలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చారు, మరి వాటి సంగతేంటి. !’

రాబోయే కాలం మాది…పోయేకాలం వైసీపీది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. వాసుపల్లి గణేష్ ఎమ్మల్యేగా రాజీనామా చేయకుండా పార్టీ విడిచి వెళ్లారంటూ విమర్శించారు. తనకు, బండారుకు ఎన్నో ఆఫర్లు వచ్చాయని.. అయినా విలువలకు కట్టుబడి పార్టీ మారలేదన్నారు. చాలా సార్లు చంద్రబాబు వాసుపల్లి మాటలే విన్నారని.. ఆయనకు అంతటి గౌరవం ఇస్తే ఇప్పుడు కనీస మర్యాద లేకుండా వ్యవహరించారని అయ్యన్న తప్పుబట్టారు. ఏం చేద్దామని వైసీపీలోకి వెళ్లారన్న ఆయన.. సొంత పార్టీ వారికే జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం‌లేదు… వైసీపీలోకి వెళ్లిన వారందరూ ఇంట్లో కాళీగా కూర్చుంటున్నారని ఎద్దేవా చేశారు. నెలాఖరుకల్లా టీడీపీ జిల్లా కమిటీలు ప్రకటిస్తామని.. విశాఖ కార్పొరేషన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకునేలా కృషి చేస్తామని ఆయన అన్నారు. జగన్ యూరప్ లో ఒక సలహాదారుని నియమించుకున్నారు.. రాష్ట్రం ఆర్ధిక పరిస్ధితి అధోగతిలో ఉన్నప్పుడు దుబారా ఖర్చుకాదా అంటూ వ్యాఖ్యానించారు అయ్యన్న. అమరావతిలో జడ్జిలకు చంద్రబాబు ఇళ్ల స్ధలాలు కేటాయిస్తే దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని.. 2005 లో వైఎస్ సీఎం గా వున్నపుడు హైదరాబాదులో 500 చ.గ. చొప్పున ఇళ్ల స్ధలాలు న్యాయమూర్తులకు ఇచ్చారని.. అదీ దురుద్దేశంతో ఇచ్చినట్లేనా అని ఆయన వైసీపీ నేతల్ని నిలదీశారు.

Related Tags