Breaking News
  • సచివాలయంలోని పశుసంవర్ధక శాఖ లో పనిచేస్తున్న సెక్షన్ అఫిసర్ కు కరోనా పాజిటివ్ గుర్తింపు.. ఇటీవల ఢిల్లీ వెళ్లాడని తెలిసి కరోనా టెస్టులు... టెస్టు చేసిన అనంతరం పాజిటివ్ గా వచ్చినట్లు గుర్తింపు.. గాంధీ ఆస్పత్రి కి తరలించిన అధికారులు.. బిఆర్కే భవనం మొత్తం షానిటైజేషన్ చేస్తున్న అధికారులు.
  • మర్కజ్ ఘటనపై వివరాలు సేకరించిన కేంద్ర హోంశాఖ. దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి తబ్లీజ్ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండోనేషియా, మలేషియా, థాయ్ లాండ్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, కజకిస్తాన్ నుంచి ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
  • దేశవ్యాప్తంగా మొత్తం 1418 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు. ఈ రోజే 167 పాజిటివ్ కేసులు నమోదు. దేశ వ్యాప్తంగా కరోనా తో 45 మంది మృతి. ఈ ఒక్క రోజే 13 మంది కరోనా తో మృతి చెందినట్లు వెల్లడి. కరోనా నుంచి 123 మంది డిశ్చార్జి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ.
  • ఉక్రెయిన్​లో చిక్కుకున్న 300 మంది తెలుగు విద్యార్థులు. తిండి లేక ఆకలితోనే గడుపుతున్న విద్యార్థులు. చేతిలో చిల్లి గవ్వ లేక ఎన్నో ఇబ్బందులు. కరోనా రక్కసి మింగేస్తుందేమోననే భయంతో బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు.
  • తెలంగాణ లో ఇప్పటి వరకు 97 కేసులు నమోదు. ప్రస్తుతం 77 మంది వివిధ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులు. ఈ ఒక్క రోజు 15 పాజిటివ్ కేసులు నమోదు. 14 మంది డిశ్చార్జ్,6 మృతి...

నాడు రష్మిక.. నేడు తమన్నా.. స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు టార్గెట్‌గా మారారు!

Tamanna Comments On Vijay Goes Viral, నాడు రష్మిక.. నేడు తమన్నా.. స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు టార్గెట్‌గా మారారు!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ క్రేజే వేరు. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత మాస్‌లో ఆ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ ఒకరు. అంతేకాక తమ అభిమాన హీరోను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే.. వారు సారీ చెప్పేవరకు వదలరు దళపతి ఫ్యాన్స్. అలాంటి వారికి తమన్నా అడ్డంగా దొరికిపోయింది. ఆమె తమిళంలో నటించిన ‘పెట్రోమాక్స్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయ్ గురించి ఓ చిన్న మాట చెప్పండి అని ఇంటర్వ్యూవర్ ప్రశ్నించగా.. ఆయన గురించి నాకు పెద్దగా తెలియదని చెప్పేసేంది. ఇద్దరం కలిసి ఒక సినిమాలో నటించినా… ఆ సమయంలో పెద్దగా కమ్యూనికేషన్ జరగలేదు. అలాంటప్పుడు ఆయన గురించి ఏమి తెలియకుండా ఎలా కామెంట్ చేయగలను అంది. అంటే ఈ మాటలకు విజయ్ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. గొప్ప స్టార్ హీరోను పట్టుకుని.. ఎవరో తెలియదని నీవు చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ తమన్నాను సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్నారు. తెలుగు, తమిళంలో ఇప్పుడిప్పుడే కెరీర్‌ను గాడిలో పెట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తమన్నా.. ఈ సమయంలో విజయ్ ఫ్యాన్స్‌కు బుక్కయ్యింది.

అటు కన్నడ కస్తూరి రష్మిక మందన్నా కూడా తనకు తెలియకుండానే ఇటువంటి ప్రాబ్లెమ్‌లో పడింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా చేస్తున్న ఈ బ్యూటీ.. రీసెంట్‌గా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన దసరా స్పెషల్ లుక్‌ని గానీ, సినిమాను గానీ, మహేష్ పేరును గానీ సోషల్ మీడియాలో ప్రస్తావించకపోవడంతో.. ఆయన ఫ్యాన్స్ రష్మికపై ఫైర్ అవుతున్నారు. ‘రష్మికా.. నిద్రపోతున్నావా’ అంటూ నెట్టింట్లో విరుచుకుపడుతున్నారు. స్టార్ హీరోయిన్లు అయ్యుండీ… నోరు జారితే వెనక్కి తీసుకోలేమన్న చిన్న విషయాన్ని ఎలా మరిచిపోతున్నారో తెలియట్లేదు.

Related Tags