కరోనాలో ఎన్ని స్టేజిలుంటాయ్..? ఆ దశల్లో ఏం జరుగుతోంది..?

కరోనా …కరోనా…అదో భయం..అదో భూతం. మహమ్మారి పుట్టింది చైనాలో అయినా…ప్రపంచదేశాలను పట్టి పీడిస్తోంది. భారత్‌లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. వైరస్‌ అంచెలంచెలుగా వ్యాపిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎప్పుడు..ఎటువైపు నుంచి కరోనా కబళిస్తోందో అర్థంకానీ పరిస్థితి. తేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిపోతోంది. కరోనా దెబ్బకు అన్ని దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇంతకీ ఈ ప్రాణాంతక వైరస్‌ ఎలా వ్యాపిస్తుంది..? దాన్ని ఎలా కట్టడి చేయవచ్చు..? ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను కంట్రోల్‌ చేయడం పెద్ద […]

కరోనాలో ఎన్ని స్టేజిలుంటాయ్..? ఆ దశల్లో ఏం జరుగుతోంది..?
Follow us

|

Updated on: Mar 23, 2020 | 10:47 AM

కరోనా …కరోనా…అదో భయం..అదో భూతం. మహమ్మారి పుట్టింది చైనాలో అయినా…ప్రపంచదేశాలను పట్టి పీడిస్తోంది. భారత్‌లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. వైరస్‌ అంచెలంచెలుగా వ్యాపిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎప్పుడు..ఎటువైపు నుంచి కరోనా కబళిస్తోందో అర్థంకానీ పరిస్థితి. తేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిపోతోంది. కరోనా దెబ్బకు అన్ని దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇంతకీ ఈ ప్రాణాంతక వైరస్‌ ఎలా వ్యాపిస్తుంది..? దాన్ని ఎలా కట్టడి చేయవచ్చు..?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను కంట్రోల్‌ చేయడం పెద్ద సవాలే. అగ్రదేశాలు సైతం మహమ్మారి ధాటికి విలవిలాడిపోతున్నాయి. ముందుగానే మేల్కొన్న దేశాలు వైరస్‌ను కట్టడి చేయగలిగాయి. సింగపూర్‌, జపాన్‌, వియత్నాం వంటి దేశాలు కరోనాను కంట్రోల్‌ చేశాయి. నిర్లక్ష్యం వహించిన ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌ వంటి యూరోప్‌ దేశాలు నిర్లక్ష్యం చేశాయి. మూల్యం చెల్లిస్తున్నాయి. ఇవే అనుభవాలుగా భారత్ కూడా కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు అనేక చర్యలు చేపట్టింది.

ప్రపంచవ్యాప్తంగా కరాళనృత్యం చేస్తున్న కరోనా వ్యాప్తిలో మొత్తం నాలుగు కీలకదశలు ఉన్నాయి. తొలిదశలో విదేశాల నుంచి వచ్చిన వాళ్లకే కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ వస్తుంది. చైనా, ఇటలీ, ఇరాన్, అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్, ఇండోనేషియా, యూకే లాంటి దేశాలకు వెళ్లి వచ్చినవారి ద్వారా దేశంలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే విదేశాలకు వెళ్లి వచ్చేవాళ్లను ఆయా దేశాల్లోనే నియంత్రించడం ద్వారా తొలి దశలోనే వైరస్‌ను కట్టడి చేయవచ్చు.

ఇక విదేశాల్లో కరోనా బారినపడి వ్యక్తి భారత్‌కు వచ్చిన తర్వాత వారి కుటుంబసభ్యులు, సహోద్యోగులకు వైరస్‌ విస్తరింపజేస్తే దాన్ని రెండో దశగా గుర్తించారు. కరోనా వ్యాప్తిలో ఈ స్టేజ్‌ చాలా డేంజర్‌. దేశంలో ప్రస్తుతం ఈ రెండో దశ కొనసాగుతుంది.ఇప్పటివరకూ దేశంలో ఇతర దేశాల నుండి వచ్చిన వారిలోనే ఎక్కువగా పాజిటివ్‌ కేసులు గుర్తించారు. విమానాశ్రయాల్లో విదేశీ ప్రయాణికులు దిగగానే వారికి స్క్రీనింగ్‌ చేయడం, లక్షణాలు ఉన్నవారిని ఆస్పత్రులకు తరలించి చికిత్సలు చేయించడం, వ్యాధి లక్షణాలు లేకపోయినా వారిని ఇతరులకు దూరంగా ఉంచడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ విస్తరించకుండ కట్టడి చేయవచ్చు. అయితే దేశంలో ఇప్పటికే స్థానికులకు కూడా కరోనా సంక్రమించింది. తెలుగురాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర,పంజాబ్‌లో కూడా ఇలాంటి కరోనా కేసులు తాజాగా బయటపడ్డాయి.

ఇక మూడోదశ అత్యంత కీలకమైంది. ప్రమాదకరమైన దశ. భారత్‌ ప్రస్తుతం రెండో దశ నుంచి మూడోదశ లోకి వెళ్తోంది.ఈ దశను లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌గా వ్యవహరిస్తుంటారు.మూడోదశలోకి అడుగుపెడితే ఆపడం భారత్‌ వంటి దేశాలకు పెనుముప్పుగా మారుతుంది. రెండో దశలో వైరస్‌ బారిన పడిన వారి నుంచి చుట్టుపక్కల ఉన్న వారికి పెద్ద ఎత్తున వైరస్‌ విస్తరిస్తుంది. అతి తక్కువ సమయంలోనే వేలాది మందికి వ్యాపిస్తుంది. మరణాల సంఖ్య భారీగా ఉంటోంది. ఇటలీ, ఇరాన్‌లు ప్రస్తుతం ఇదే దశను ఎదుర్కొంటున్నాయి.

వైరస్‌ నియంత్రణ చేయిదాటిపోయేదే నాలుగోదశ. ప్రస్తుతం ఇటలీ, ఇరాన్‌ ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ దశను తొలిసారి చూసిన దేశం చైనా. ఈ దశలోనే అక్కడ కేసుల సంఖ్య 80 వేలు దాటిపోయింది. ఆలస్యంగా మేల్కొన్నప్పటికీ..కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చింది. కానీ ఇరాన్, ఇటలీ వంటి దేశాలు మాత్రం ఇప్పటికీ వైరస్‌తో పోరాడుతూనే ఉన్నాయి.

మొత్తానికి కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. భారత్‌లోనూ స్వైర విహారం చేస్తోంది. అయితే స్వీయ నియంత్రణతోపాటు సొంత మనుషులైనా సరే వారితో కలవకుండా సోషల్ డిస్టెన్స్‌ని పాటించడం ద్వారా వైరస్‌ని కొంతవరకు కట్టడి చేయవచ్చు.

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ