డ్రగ్స్‌ కేసులో శ్రీలంక బౌలర్ అరెస్ట్..!

డ్రగ్స్‌ కేసులో శ్రీలంక బౌల‌ర్ బుక్క‌వ్వ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. బౌలర్ షెహన్ మధుశంకా డ్ర‌గ్స్ కేసులో తాజాగా అరెస్టయ్యాడు. 2017లో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన‌ మధుశంకా.. ఫ‌స్ట్ మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు తీసి త‌న స‌త్తా ఏంటో నిరూపించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆ వన్డే మ్యాచ్‌లో వరుసగా మొర్తజా, రుబెల్ హుస్సేన్, మహ్మదుల్లా వికెట్లను దొర‌క‌బుచ్చుకున్నాడు. అయితే.. గాయం కారణంగా 2018 నుంచి ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌కి ఈ పేసర్ దూరమయ్యాడు. కరోనా వైరస్ నేప‌థ్యంలో మార్చి […]

డ్రగ్స్‌ కేసులో శ్రీలంక బౌలర్ అరెస్ట్..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 26, 2020 | 9:56 AM

డ్రగ్స్‌ కేసులో శ్రీలంక బౌల‌ర్ బుక్క‌వ్వ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. బౌలర్ షెహన్ మధుశంకా డ్ర‌గ్స్ కేసులో తాజాగా అరెస్టయ్యాడు. 2017లో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన‌ మధుశంకా.. ఫ‌స్ట్ మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు తీసి త‌న స‌త్తా ఏంటో నిరూపించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆ వన్డే మ్యాచ్‌లో వరుసగా మొర్తజా, రుబెల్ హుస్సేన్, మహ్మదుల్లా వికెట్లను దొర‌క‌బుచ్చుకున్నాడు. అయితే.. గాయం కారణంగా 2018 నుంచి ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌కి ఈ పేసర్ దూరమయ్యాడు.

కరోనా వైరస్ నేప‌థ్యంలో మార్చి నుంచి శ్రీలంకలో లాక్‌డౌన్ అమల్లో ఉండగా.. ఇటీవల రూల్స్ కొన్ని సడలించారు. కానీ.. ఫ్రెండ్ తో కలిసి కారులో పన్నాల రోడ్డుపై వెళ్తున్న షెహన్ మధుశంకా‌ని ఆపిన పోలీసులు.. త‌నిఖీలు చేశారు. ఆ సమయంలో షెహన్ మధుశంకా వద్ద 2 గ్రాముల హెరాయిన్ దొర‌క‌డంతో అతనిపై కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. ఆయ‌న‌ రెండు వారాల కస్టడీకి ఆదేశించారు. మార్చి 20 నుంచి ఇప్పటి వరకూ శ్రీలంకలో దాదాపు 65 వేల మంది లాక్‌డౌన్ రూల్స్ ఉల్లంఘించి అరెస్టయ్యారు. ఇందులో సామాన్య ప్ర‌జ‌ల‌తో పాటు చాలామంది ప్రముఖులు కూడా ఉండగా.. క్రికెటర్‌ కూడా ఆ లిస్ట్ లో చేరడం గ‌మ‌నార్హం. శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా షెహన్ మధుశంకాపై చర్యలు తీసుకునే అవకాశాలు క‌నిపిస్తున్నాయి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు